Tollywood Actor Wedding: బ్యాచిలర్ లైఫ్‌కు టాలీవుడ్ హీరో గుడ్‌బై.. ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్

‘బస్ స్టాప్’, ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో ప్రిన్స్ (Prince). విలక్షణ డైరెక్టర్ తేజ కంపౌండ్ నుంచి వచ్చిన ప్రిన్స్, ఈ క్రేజీ సినిమాలతోనే యూత్ ఆడియన్స్కు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజన్1లో తన ఆట తీరుతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన ప్రిన్స్, త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మరి ప్రిన్స్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఎక్కడ ఉంటుంది? వీరి ప్రేమ ఎలా మొదలైంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
NRI అమ్మాయితో ఎంగేజ్ మెంట్
న్యూజిలాండ్‌లో నివసిస్తున్న ఎన్నారై (NRI) అమ్మాయి సాయి మాచిరాజుతో ప్రిన్స్ వివాహం నిశ్చయమైంది. గత నెల ప్రారంభంలోనే వీరిద్దరి నిశ్చితార్థం (ఎంగేజ్‌మెంట్) కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది.
డెస్టినేషన్ వెడ్డింగ్.!
రీసెంట్‌గా ప్రిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేస్తూ.. “నేను కూడా ఒక ఇంటివాడిని కాబోతున్నాను” అంటూ అఫీషియల్‌గా గుడ్ న్యూస్ చెప్పి అందరికీ స్వీట్ షాక్ ఇచ్చాడు. ఈ వీడియోలో తన ప్రియురాలు సాయికి ప్రపోజ్ చేసిన మూమెంట్ ఆకట్టుకుంటుంది. ఈ పార్టీలో హీరో ప్రియదర్శి కూడా కనిపించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ లవ్ బర్డ్స్ ఆగస్టు 24న న్యూజిలాండ్‌లోనే గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు టాక్. ఇపుడు ఈ క్రేజీ అప్డేట్ బయటకు రావడంతో ప్రిన్స్ ఫ్యాన్స్, నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు కొత్త జంటకు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెప్తూ విషెస్ వర్షం కురిపిస్తున్నారు.
ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ గురూ!
గత ఏడాది సెప్టెంబర్‌లో ఒక కామన్ ఫ్రెండ్ మ్యారేజ్‌లో వీరిద్దరికీ ఫస్ట్ టైమ్ పరిచయం అయ్యింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారని, ఆ ఫ్రెండ్‌షిప్ కాస్తా నెక్స్ట్ లెవెల్ లవ్‌గా మారిందని ప్రిన్స్ వెల్లడించాడు. ఇక ఇరువైపులా పెద్దలను ఒప్పించి ఇప్పుడు పెళ్లి పీటల వరకు తీసుకొచ్చేసింది ఈ జంట. ప్రస్తుతం ప్రిన్స్ ఒకవైపు హీరోగా చేస్తూనే, మరోవైపు డిఫెరెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రిన్స్ తన జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభించబోతున్నాడు.