July 21, 2026

హైదరాబాద్‌లో విషాదం.. మద్యం బాటిల్‌లో విషం కలిపి తాగి ఆత్మహత్య

హైదరాబాద్‌లో విషాదం.. మద్యం బాటిల్‌లో విషం కలిపి తాగి ఆత్మహత్య
Reading Time: < 1 minute

హైదరాబాద్‌లో విషాదం.. మద్యం బాటిల్‌లో విషం కలిపి తాగి ఆత్మహత్య

Caption of Image.

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. బండ్లగూడ జాగీర్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మృతుడిని ఐటీ ఉద్యోగి సుధాకర్‌గా పోలీసులు గుర్తించారు. తన ఇంటి బెడ్‌రూమ్‌లోనే సుధాకర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మద్యం బాటిల్‌లో విషం కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.

సుధాకర్ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

సుధాకర్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు.. ఆఫీస్ ఒత్తిడి కారణమా? లేక కుటుంబ సమస్యలా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.