July 21, 2026

ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం..భక్తజన సంద్రంగా బల్కంపేట

ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం..భక్తజన సంద్రంగా బల్కంపేట
Reading Time: < 1 minute

ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం..భక్తజన సంద్రంగా బల్కంపేట

Caption of Image.

హైదరాబాద్ లో  ఆషాఢ మాసం మొదటి మంగళవారం సందర్భంగా… ప్రముఖ పుణ్యక్షేత్రం బల్కంపేట ఎల్లమ్మ తల్లి వార్షిక కళ్యాణ మహోత్సవం నేడు అత్యంత వైభవంగా జరుగుతోంది. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో నిన్న అమ్మవారిని పెళ్లికూతురిగా ముస్తాబు చేసి ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక నేడు అమ్మవారి కళ్యాణ మహోత్సవంతో ఆలయం, కళ్యాణ మండపం విద్యుత్ కాంతులతో సుందరంగా ముస్తాబయ్యాయి.

ఉదయం 3 గంటల నుంచే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలంకరణలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉదయం 10 గంటలకు కళ్యాణ వేడుకలు మొదలుకానుండగా… సరిగ్గా ఉదయం 11:59 నిమిషాలకు జగన్మాత ఎల్లమ్మ తల్లి కళ్యాణ సుముహూర్తం జరగనుంది! రేపు రథోత్సవంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.

ఈ ఏటా భక్తుల రద్దీ భారీగా ఉండటంతో… ప్రభుత్వం, స్థానికుల సహకారంతో అన్ని శాఖలు సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేశాయి. గత సంవత్సరం దాదాపు 7 లక్షల మంది భక్తులు విచ్చేయగా… ఈసారి లక్షలాదిగా తరలివచ్చే భక్తులు, శివసత్తులు, జోగినుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సాధారణ భక్తులు ,VIPల కోసం 7 ప్రత్యేక క్యూలైన్లు అందుబాటులో ఉన్నాయి.కళ్యాణాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించేలా ప్రాంగణమంతటా LED స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాలు, తాగునీటి సదుపాయం, 6 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు.

భద్రత పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా… దాదాపు 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 36 రెగ్యులర్ కెమెరాలతో పాటు, అదనంగా 130 CCTV కెమెరాలతో నిరంతర నిఘా ఉంచారు. ట్రాఫిక్ కంట్రోల్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పరిసర ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షిస్తూ, వాహనాల రాకపోకల కోసం ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్లు విధించారు.

 

©️ VIL Media Pvt Ltd.