July 21, 2026

Chennai LoveStory : ‘చెన్నై లవ్‌స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు

Chennai LoveStory : ‘చెన్నై లవ్‌స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు  ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
Reading Time: < 1 minute
Megastar Chiranjeevi To Grace Chennai Love Story Pre Release Event As Chief Guest

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘చెన్నై లవ్ స్టోరీ’. SKN, సాయి రాజేష్ నిర్మిస్తుండగా రవి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం చుట్టూ రోజురోజుకూ బజ్ విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రోమోలు, పాటలు ఇప్పటికే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకోగా, తాజాగా సెన్సార్ బోర్డ్ నుంచి లభించిన అద్భుతమైన పాజిటివ్ టాక్ మూవీ టీమ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ నుండి క్లీన్ U సర్టిఫికెట్ అందుకున్న చెన్నై లవ్ స్టోరీ కిరణ్ కెరీర్ లో బెస్ట్ అని అవుతుందని యూనిట్ నమ్ముతోంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నిర్వహించనున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ రాకతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. సెన్సార్ బోర్డ్ సభ్యుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం, మెగాస్టార్ ఆశీస్సులు తోడవడంతో ‘చెన్నై లవ్ స్టోరీ’ తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో యూనిట్ ఉంది. జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న థియేటర్లలో సందడి చేయనున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి!