July 21, 2026

Ananya Pande : అనన్య పాండే నడుము గగిల్లిన గుప్తా

Ananya Pande : అనన్య పాండే నడుము గగిల్లిన గుప్తా
Reading Time: < 1 minute
Ananya Panday Faced Discomfort At Mumbai Fashion Show Gaurav Guptas Viral Video Sparks Outrage

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఫ్యాషన్ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా కలెక్షన్స్‌ను ప్రదర్శిస్తూ ఆమె షోస్టాపర్‌గా వ్యవహరించింది. వేదికపై అద్భుతమైన డిజైనర్ వేర్‌లో అనన్య చేసిన ర్యాంప్ వాక్ అక్కడి వారందరినీ మంత్రముగ్ధులను చేసింది. అయితే  షో అంతా సజావుగానే సాగినప్పటికీ.. ఈవెంట్ ముగింపులో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ర్యాంప్ వాక్ ముగిసిన తర్వాత డిజైనర్ గౌరవ్ గుప్తాతో కలిసి అనన్య పాండే మీడియా ప్రతినిధులకు ఫోటోలు ఇస్తోంది. ఈ క్రమంలో సదరు డిజైనర్ అనన్యతో కాస్త అతి చేసాడు. ఫొటోలకు పోజులు ఇస్తున్న సమయంలో అనన్య నడుముపై చేతులు వేసి గిల్లడంతో అనన్య  కాస్త అసౌకర్యానికి గురైంది. ఆ సమయంలో ఆమె బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికల్లో ఆ ఇబ్బంది స్పష్టంగా కనిపించింది. వందలాది మంది చూస్తున్న బహిరంగ వేదిక కావడం, చుట్టూ మీడియా కెమెరాలు ఉండటంతో అనన్య ఈ పరిస్థితిని చాలా హుందాగా హ్యాండిల్ చేసింది. ఏమాత్రం సహనం కోల్పోకుండా పైకి నవ్వుతూనే మెల్లగా అతని పక్క నుండి చాకచక్యంగా తప్పుకుంది. ఆ తర్వాత కూడా ఎలాంటి వివాదానికి తావివ్వకుండా, ఎంతో ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తూ డిజైనర్‌ను అభినందించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికలపై విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ విజువల్స్ చూసిన నెటిజన్లు, అనన్య అభిమానులు సదరు ఫ్యాషన్ డిజైనర్ వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.