July 19, 2026

ప్రజలను విదేశాలకు వద్దంటున్నారు.. మీరెందుకు వెళ్తున్నారు కేటీఆర్: మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రజలను విదేశాలకు వద్దంటున్నారు.. మీరెందుకు వెళ్తున్నారు కేటీఆర్: మంత్రి వివేక్ వెంకటస్వామి
Reading Time: < 1 minute

ప్రజలను విదేశాలకు వద్దంటున్నారు.. మీరెందుకు వెళ్తున్నారు కేటీఆర్: మంత్రి వివేక్ వెంకటస్వామి

Caption of Image.

సరూర్ నగర్ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి.  తెలంగాణ ప్రజలకు విదేశాల్లో ఉద్యోగాలు ఎందుకు.. విదేశాలకు ఎందుకు పోవాలి అని సీఎం రేవంత్ ను ప్రశ్నించిన కేటీఆర్.. మరి మీరెందుకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.  మరి మీ కుటుంబ సభ్యులు విదేశాలు ఎందుకు వెళ్లారు.. అక్కడ ఎందుకు చదువుతున్నారని  ప్రశ్నించారు.

మీరు మాత్రమే విదేశాలకు వెళ్లి చదవాలా.. సామాన్య ప్రజలు విదేశాలకు వెళ్లి చదవద్దా అని నిలదీశారు. మీ కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రజలు 6 రాజ్య సభ పదవులు ఇచ్చారు.  మంత్రి పదవులు ఇచ్చారు. అలాంటి పేదలకు మంచి జరుగుతుంటే  ఓర్చుకోలేకపోతున్నారు అంట ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పేదలకు మంచి జరగలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. అది చూసి ఓర్వలేక కేటీఆర్ వ్యర్థ ప్రేలాపనలు చేస్తున్నారని అన్నారు. ఈ ప్రజా ప్రభుత్వం ను దించాలని మనసులో పెట్టుకుని ఎదేదో మాట్లాడుతున్నారని అన్నారు. పదవి లేకపోవడం తో ఇలా ప్రవర్తిస్తున్నారని విమర్శిస్తున్నారు. 

ఉద్యమం సమయంలో కేసీర్ కు ప్రజలు తెలంగాణా ఉద్యమం చేయమని డబ్బులు ఇచ్చారు.. మీ  చెల్లే  అడుగుతుంది కదా కేటీఆర్..  రూ.1400 కోట్లు మీకు ఎలా వచ్చాయో సమాధానం చెప్పండి అంటూ డిమాండ్ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.