July 21, 2026

Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం

Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
Reading Time: < 1 minute
The Telugu Trailer For Avengers Doomsday Has Been Released Thor Is Wreaking Massive Havoc

హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజ్ మార్వెల్ కు వరల్డ్ వైడ్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మార్వెల్ నుండి సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత భారీ మల్టీవర్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో మళ్ళీ ఊపిరి పోసేలా వచ్చిన ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ వంటి హిస్టారికల్ హిట్స్ అందించిన రూసో బ్రదర్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈసారి గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్ గ్రాండ్ నెస్ గత సినిమాలను మించేలా ఉన్నాయని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ ఐరన్ మ్యాన్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్. ఈసారి ఐరన్ మ్యాన్‌గా కాకుండా ‘డాక్టర్ డూమ్’ అనే ఐకానిక్ నెగెటివ్ పాత్రలో అలరించబోతున్నారు. రాబర్ట్ డౌనీ జూనియర్ పాటు క్రిస్ హెమ్స్‌వర్త్ (థోర్), వనెస్సా కిర్బీ, ఆంథోనీ మాకీ (కెప్టెన్ అమెరికా), సెబాస్టియన్ స్టాన్, లెటీషియా రైట్ వంటి భారీ స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 2026 డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇండియాలో ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే విధంగా రిలీజ్ చేస్తున్నారు.