July 21, 2026

Aadhaar App: ఆధార్ యాప్‌లో ఈ ఒక్క పని చేస్తే మీ కార్డు సేఫ్.. ఎవరూ ఉపయోగించలేరు..

Aadhaar App: ఆధార్ యాప్‌లో ఈ ఒక్క పని చేస్తే మీ కార్డు సేఫ్.. ఎవరూ ఉపయోగించలేరు..
Reading Time: < 1 minute
Aadhaar App: ఆధార్ యాప్‌లో ఈ ఒక్క పని చేస్తే మీ కార్డు సేఫ్.. ఎవరూ ఉపయోగించలేరు..

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ నెలాఖరులో కొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. జనవరిలో దీనికి సంబంధించి పూర్తి స్థాయి వెర్షన్‌ను రిలీజ్ చేసింది. ఈ యాప్ ద్వారా ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలు తమ మొబైల్ నుంచే సేవలు పొందవచ్చు. ఈ యాప్ ద్వారా సేవలు పొందటం సలుభంగా ఉండటంతో వినియోగదారులు తెగ వాడేస్తున్నారు. ఆధార్ బయోమెట్రిక్ లాక్ లేదా అన్ లాక్ ఫీచర్లను ఎక్కువ మంది ఆధార్ వినియోగదారులు యాప్ ద్వారా ఉపయోగిస్తున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. జూలై 18న ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఆధార్ యాప్ నాలుగు కోట్ల డౌన్‌లోడ్‌లు దాటగా.. బయోమెట్రిక్ లాక్, అన్‌లాక్ టూల్ 1.91 కోట్లకుపైగా సార్లు ఉపయోగించబడినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

బయెమెట్రిక్స్ లాక్ లేదా అన్ లాక్ ఫీచర్ అనేది ఆధార్ నంబర్‌తో అనుసంధానించబడ్డ వేలిముద్ర, కనుపాప, ముఖ ధృవీకరణను నిరోధిస్తుంది. బయోమెట్రిక్ ధృవీకరణ అవసరం లేనప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వేలిముద్ర, ముఖ స్కాన్ లేదా కనుపాప స్కాన్ అవసరమయ్యే సేవలను పూర్తి చేయడానికి ముందు వినియోగదారులు తమ వివరాలను మళ్లీ అన్‌లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ అధార్ ఇతరులు వాడకుండా ఇది రక్షిస్తుంది. మీరు లాక్ చేసుకుంటే.. మీ ఆధార్ నంబర్‌ను ఉపయోగించి చేసే బయోమెట్రిక్ వెరిఫికేషన్లు విఫలమవుతాయి. UIDAI ఇటువంటి విఫల ప్రయత్నాలను ఎర్రర్ కోడ్ 330 కింద నమోదు చేస్తుంది. దీని అర్థం ఆధార్ బయోమెట్రిక్‌లను లాక్ చేశారని అర్థం.

యాప్ ద్వారా ఆధార్ లాక్ లేదా అన్‌లాక్ ఎలా చేసుకోవాలి..?

-ఆధార్ యాప్‌ను తెరవండి

-ఆరు అంకెల పిన్‌ను ఉపయోగించి సైన్ ఇన్ చేయండి

-హోమ్ స్క్రీన్‌పై ఆధార్ కార్డు కింద కనిపించే బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి

– లాక్‌ను యాక్టివేట్ చేయమనే అభ్యర్థనను నిర్ధారించండి

-సెక్యూరిటీ ట్యాబ్‌ను తెరవండి

-బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్‌ను ఎంచుకోండి

-లాక్ అభ్యర్థనను నిర్ధారించండి

-వేలిముద్ర, కనుపాప లేదా ముఖ ప్రమాణీకరణను మళ్లీ ఉపయోగించడానికి, అదే ఎంపికకు తిరిగి వెళ్లి బయోమెట్రిక్స్‌ను అన్‌లాక్ చేయండి.