July 21, 2026

సోనమ్ వాంగ్ చుక్ భార్యను జుట్టు పట్టి కొట్టారు : సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే

సోనమ్ వాంగ్ చుక్ భార్యను జుట్టు పట్టి కొట్టారు : సీజేపీ  చీఫ్ అభిజిత్ దీప్కే
Reading Time: < 1 minute

సోనమ్ వాంగ్ చుక్ భార్యను జుట్టు పట్టి కొట్టారు : సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే

Caption of Image.

ఢిల్లీ లో  కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టి పార్లమెంట్ మార్చ్ శాంతి యుత ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు వెళ్తున్న  విద్యార్థులు, సీజేపీ సపోర్టర్లపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.12 బాలికతో సహా చాలామంది సపోర్టర్లు గాయపడినట్లు  సీజేపీ ఆరోపిస్తోంది. పోలీసుల లాఠీఛార్జ్ లో సోనమ్ వాంగ్ చుక్ భార్య గీతాంజలిపై కూడా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఆమెను జుట్టుపట్టుకొని లాక్కెళ్లారని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆరోపించారు. 

నీట్ఎగ్జామ్ లీక్ లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని గత కొద్ది రోజులుగా  కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యావ్యవస్థలో సమూలమార్పులు  తీసుకురావాలని  పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార సోమవారం నాటికి 23 రోజుకు చేరుకుంది. అయినప్పటికీ కేంద్రం స్పందించకపోవడంతో పార్లమెంట్ ను ముట్టడించేందుకు వేలాది మంది సపోర్టర్లతో సీజేపీ ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించారు. 

మరోవైపు వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 23రోజుకు చేరింది.  ఆయన ఆరోగ్యం  పూర్తిగా క్షీణించింది. ఢిల్లీలోని సప్దర్ జంగ్ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో  సోమవారం జరిగిన పార్లమెంట్ మార్చ్ కు వేలాది మందివిద్యార్థులు, మద్దతుదారులు  ఢిల్లీకి తరలివచ్చారు. పార్లమెంట్ ను ముట్టడించేందుకు ప్రయత్నించిన క్రమంలో పోలీసు లాఠీఛార్జ్ తో దేశరాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.