July 21, 2026

లివర్ సిరోసిస్ ప్రమాదం తగ్గాలంటే.. రోజువారీ ఆహారంలో ఇవి ఉండాల్సిందే!

లివర్ సిరోసిస్ ప్రమాదం తగ్గాలంటే.. రోజువారీ ఆహారంలో ఇవి ఉండాల్సిందే!
Reading Time: < 1 minute

మన శరీరంలో కాలేయం (లివర్) అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. అయితే ఈ రోజుల్లో సరిగ్గా లేని జీవనశైలి, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ‘ఫ్యాటీ లివర్’ సమస్య వేగంగా పెరుగుతోంది. దీనిని తొలి దశలోనే నిర్లక్ష్యం చేస్తే లివర్ సిరోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మరి సరైన ఆహార అలవాట్లతో లివర్‌ను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రాసెస్డ్ చెక్కరలకు దూరం: కృత్రిమ చక్కెరలు (ఆర్టిఫిషియల్ షుగర్స్), కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల లివర్‌లో కొవ్వు వేగంగా పేరుకుపోతుంది. అందుకే స్వీట్లు, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే మన కాలేయానికి అంత మేలు జరుగుతుంది.

హై ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్, ఆలివ్ ఆయిల్:  రోజూ ఉదయాన్నే ప్రొటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం చాలా మంచిది. అలాగే వంటల్లో సాధారణ నూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం వల్ల లివర్‌లో కొవ్వు నిల్వలు పెరగకుండా నిరోధించవచ్చు. చేపలు, ఒమేగా-3 సప్లిమెంట్లు!చేపలలో లభించే మంచి ఫ్యాటీ యాసిడ్స్ కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Reduce Liver Cirrhosis Risk with These Everyday Foods
Reduce Liver Cirrhosis Risk with These Everyday Foods

ఇక విటమిన్-E సహాయం: రోజువారీ ఆహారంలో చేపలు, ఒమేగా-3 సప్లిమెంట్లను చేర్చుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వాపు తగ్గి, పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఇక ఫ్యాటీ లివర్ ప్రభావాన్ని తగ్గించడంలో డ్యామేజ్ అయిన కాలేయ కణాలను మళ్లీ పునరుద్ధరించడంలో విటమిన్-E సప్లిమెంట్లు అద్భుతంగా పనిచేస్తాయి. వైద్యుల సలహాతో వీటిని సరిగ్గా ఉపయోగిస్తే లివర్ సిరోసిస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

ఇక మనం తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను సులభంగా రివర్స్ చేయవచ్చు. మంచి ఆహార అలవాట్లు పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే లివర్‌ను నిరంతరం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

గమనిక: పైన పేర్కొన్న సప్లిమెంట్లు లేదా ఆహార నియమాలు పాటించే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వ్యక్తిగత వైద్యుల (డాక్టర్) సలహా తీసుకోవడం శ్రేయస్కరం

The post లివర్ సిరోసిస్ ప్రమాదం తగ్గాలంటే.. రోజువారీ ఆహారంలో ఇవి ఉండాల్సిందే! appeared first on Manalokam – Latest Telugu News & Updates.