July 21, 2026

Yash: రాకింగ్ స్టార్ యష్‌తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!

Yash: రాకింగ్ స్టార్ యష్‌తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
Reading Time: < 1 minute
Yash Prasanth Varma Pan India Movie Buzz

Yash: పాన్ ఇండియా స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండగా, వాటి తర్వాత ఈ క్రేజీ పట్టాలెక్కే అవకాశం ఉందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘KGF’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘Toxic’, చిత్రంలో నటిస్తున్నారు. అలాగే నితేశ్ తివారి డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘Ramayana’లో రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు, ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘Hanu-Man’ విజయంతో పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో రిషబ్ శెట్టితో ఒక ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘Jai Hanuman’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటించనున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తన పూర్తి ఫోకస్‌ను ఈ చిత్రంపైనే దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ సినిమా కూడా భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తాజాగా సమాచారం ప్రకారం.. యష్ – ప్రశాంత్ వర్మ తమ ప్రస్తుత కమిట్‌మెంట్‌లు పూర్తి చేసిన అనంతరం ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి గట్టిగా టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ఈ కాంబో నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఈ చిత్రం ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.