July 21, 2026

Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Reading Time: 2 minutes
Balakrishna Injury Update Kalyan Ram Get Well Soon Babai Nbk111

Kalyan Ram: కాకినాడలో జరుగుతున్న NBK111 షూటింగ్‌లో నందమూరి బాలకృష్ణకు స్వల్ప మసిల్ టియర్ అయ్యింది. వైద్యుల సూచన మేరకు మైనర్ సర్జరీ చేయించుకోనున్నారు. త్వరగా కోలుకోవాలని నందమూరి కళ్యాణ్ రామ్ భావోద్వేగంగా స్పందించారు. కాకినాడలో జరుగుతున్న #NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు స్వల్ప గాయం అయిన విషయం తెలిసిందే. ఓ భారీ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఆయనకు చిన్న మసిల్ టియర్ అయినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. వైద్యుల సూచన మేరకు పూర్తిస్థాయిలో కోలుకునేందుకు ఆయనకు మైనర్ సర్జరీ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ వార్త తెలిసిన వెంటనే అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

ఈ క్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “Get well soon Babai. ❤ Wishing you a speedy recovery. I’m sure you will be back in action in no time, doing what you love the most” అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది. బాబాయ్ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని కళ్యాణ్ రామ్ ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే, బాలకృష్ణకు సినిమాపై ఉన్న అంకితభావం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం NBK111 చిత్ర యూనిట్‌లో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తోందని చిత్రబృందం పేర్కొంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్యుల పర్యవేక్షణలో ఆయన త్వరగా కోలుకుంటారని స్పష్టం చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యంపై అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆయన పూర్తిగా కోలుకున్న వెంటనే NBK111 షూటింగ్ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.