Nandamuri Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణకు గాయాలు.. యాక్షన్ సీన్స్ చేస్తుండగా..

నటసింహం, సినీ హీరో నందమూరి బాలకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. NBK 111 సినిమాలో భాగంగా కాకినాడ పోర్టులో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా.. బాలకృష్ణ కాలికి గాయం అయింది.. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. ఆసుపత్రికి తరలించారు. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో మంచు మనోజ్, బాలకృష్ణపై యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. ఆయన మోకాలికి గాయమైంది.
బాలకృష్ణకు గాయమైందన్న వార్తలతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఎలాంటి ఆందోళన అక్కర్లేదని.. బాలయ్య బాగానే ఉన్నారని పేర్కొంటున్నారు. బాలయ్యకు పరీక్షల అనంతరం కొన్ని రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించినట్లు సమాచారం..
సంక్రాంతికి ముందే సినిమా..
మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ‘NBK 111’ భారీ యాక్షన్ సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు పేర్కొంటున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24, 2026 న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో గతంలో ‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. కావున సంక్రాంతికి ముందే రిలీజ్ అయ్యే.. ఈ కొత్త సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మంచుమనోజ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. బాలకృష్ణ సరసన కాజల్ నటిస్తోంది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..