July 21, 2026

Prabhas: ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా ప్రభాస్? ‘ఫౌజీ’ రిలీజ్ ప్రకటించిన మేకర్స్!

Prabhas: ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా ప్రభాస్? 'ఫౌజీ' రిలీజ్ ప్రకటించిన మేకర్స్!
Reading Time: 2 minutes

Prabhas: ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా ప్రభాస్? ‘ఫౌజీ’ రిలీజ్ ప్రకటించిన మేకర్స్!

Caption of Image.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi). లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది.  ఈ భారీ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ మునుపెన్నడూ చూడని వింటేజ్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తూ అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి చేర్చారు.

బ్రిటిష్ ఆర్మీ నుండి నేతాజీ సైన్యం వైపు..

1940ల నాటి చారిత్రక నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సైనికుడిగా కనిపిస్తారని సమాచారం. కథ ప్రకారం.. ప్రభాస్ మొదట బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తాడు. అయితే, దేశభక్తి దేశ సరిహద్దులు దాటాక.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు ఆకర్షితుడై.. ఆయన నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరి బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేస్తాడు. ఇది కేవలం ఒక వ్యక్తి బయోపిక్ కాదు.. దేశ స్వాతంత్య్రం కోసం రక్తం చిందించిన ఎందరో అనామక సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాల సమాహారం. ప్రభాస్ క్యారెక్టర్‌లో దేశభక్తి, ఎమోషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని టాక్.

ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ లైనప్

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్, క్లాసికల్ డ్యాన్సర్ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద వంటి ఇండియన్ సినిమా దిగ్గజాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

బాక్సాఫీస్ వేటలో రెబల్ స్టార్..

‘ఫౌజీ’తో పాటు ప్రభాస్ లైనప్ ఇండియన్ సినిమాను శాసించేలా ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోస్ట్ అవేటెడ్ పోలీస్ డ్రామా ‘స్పిరిట్’ లైన్‌లో ఉంది. ఇందులో త్రిప్తి దిమ్రీ హీరోయిన్ నటిస్తోంది. ఆ తర్వాత గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘సలార్: పార్ట్ 2’, ‘కల్కి 2898 ఏడీ: పార్ట్ 2’’ వంటి భారీ సీక్వెల్స్‌తో ప్రభాస్ థియేటర్లలో విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్నారు. దీంతో రాబోయే రెండేళ్ల పాటు ప్రభాస్ అభిమానులకు వరుసగా భారీ సినిమాల విందు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

©️ VIL Media Pvt Ltd.