Reading Time: < 1 minute
Oppo K14 Series Oppo A6s Price Hike India

ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది ఒక ముఖ్యమైన వార్త. కంపెనీ భారత మార్కెట్‌లో తన ఒప్పో K14 సిరీస్, ఒప్పో A6s ఫోన్ల ధరలను పెంచింది. విడిభాగాల వ్యయం పెరగడం, మెమొరీ చిప్‌ల ధరలు అధికమవ్వడం, సరఫరా వ్యవస్థలో తలెత్తిన సవాళ్ల కారణంగా కొన్ని మోడళ్లపై రూ. 4,000 వరకు ధరలు పెరిగాయి. ఈ కొత్త ధరలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పటికే అమలులోకి వచ్చాయి.

ఒప్పో K14 వేరియంట్ల విషయానికి వస్తే.. 6GB + 128GB మోడల్ ధర రూ. 19,999 నుంచి రూ. 21,999 కి చేరింది (రూ. 2,000 పెంపు). 6GB + 256GB వేరియంట్ రూ. 21,999 నుండి రూ. 24,999 కి పెరిగింది (రూ. 3,000 పెంపు). అత్యధికంగా 8GB + 256GB టాప్ మోడల్ ధర రూ. 23,999 నుంచి ఏకంగా రూ. 27,999 కి పెరిగి, రూ. 4,000 మేర ప్రియమైంది.

మరోవైపు ఒప్పో K14x ఫోన్ల ధరలను కూడా రూ. 1,000 మేర పెంచారు. 4GB + 64GB మోడల్ కొత్త ధర రూ. 16,999 గా ఉండగా, 4GB + 128GB వేరియంట్ ధర కూడా రూ. 1,000 పెరిగింది. ఇక 6GB + 128GB వేరియంట్ ఇప్పుడు రూ. 20,999 కి అందుబాటులో ఉంది.

అలాగే ఒప్పో A6s 5G స్మార్ట్‌ఫోన్‌లో 4GB + 128GB వేరియంట్ ధర రూ. 20,999 నుండి రూ. 21,999 కి (రూ. 1,000 పెంపు) పెరిగింది. దీనిలోని 6GB + 128GB వేరియంట్ ధరపై రూ. 2,000 పెరగడంతో, ఇప్పుడు అది రూ. 24,999 కి చేరింది. కాబట్టి ఈ ఫోన్లను కొనుగోలు చేసేముందు ఒకసారి అప్‌డేట్ చేసిన కొత్త ధరలను చెక్ చేసుకోవడం మంచిది.