ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు? సైకాలజీ చెప్పే రహస్యాలు ఇవే
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అన్ని కప్పులు ఉండగా, మీ చేయి ఒక కప్పు మీదకే ఎందుకు వెళ్తుందో.. కాగా, ఇప్పుడు మనం దీని గురించి సైకాలజీ ఏం చెబుతుందో వివరంగా తెలుసుకుందాం.ప్రతి రోజూ ఒకే కప్పులో టీ లేదా కాఫీ తాగడం, అనేది భావోద్వేగాలు,అనుబంధాలు, జ్ఞాపకాలకు సంబంధించినది అని చెబుతున్నారు, మానసిక నిపుణులు.
ఇది వారిది అని వారి భావన, అది తమ సొంతం అనే భావన కలగడం వలన వారు పదే పదే ఒకే కప్పును ఉపయోగిస్తారని 1980లో ఆర్థికవేత్త రిచర్డ్ థాలర్ అన్వేషించి తెలియజేయడం జరిగింది. దీనిని జర్నల్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అనే పుస్తకంలో ప్రచురించారు. ముఖ్యంగా చాలా మంది కొత్త కొత్త కప్పులు ఉన్నా, పట్టుకునేవి లేకపోయినా, పాడైపోయినా పాతదే ఎక్కువగా ఉపయోగిస్తారంట.
మనం రోజూ వాడే కప్పులు లేదా వస్తువులు అన్నీ కూడా వ్యక్తిగత అనుభవాలతో ముడిపడి ఉంటుందంట. ముఖ్యంగా ఉదయం పూట కాఫీ తాగే కప్పు, వారికి బయటకు వెళ్లే సమయంలో ప్రశాంతతను ఇస్తుందంట. అంతే కాకుడా, అది కుటుంబ సభ్యులతో గడిపిన క్షణాలను, అనుబంధాలను గుర్తి చేస్తుందంట. అందుకే ఎక్కువగా ఒక కప్పునే ఉపయోగిస్తారంట.
మీరు కొనుగోలు చేసినదే కావచ్చు లేదా ఎవరు అయినా బహుమతిగా ఇచ్చినది అయినా కావచ్చు, అది మీకు చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. అందుకే చాలా మంది తమ ఫేవరెట్ దానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. ఇంకా చాలా మంది అవి పాడవుతే భరించలేరంట. మగ్గు అనేది కేవలం గ్లాస్ మాత్రమే కాదు, అది ఒక జ్ఞాపకం అంటున్నారు నిపుణులు.
కొన్ని సార్లు ఎక్కువగా వాడినది, వదిలేసి, కొత్తది వాడటానికి మనసు ఒప్పదంట. అంతే కాకుండా , టెన్షన్, చిరాకు వంటి సమస్యలు ఎదురు అవుతాయంట. అందుకే పదే పదే తమకు ఇష్టమైన మగ్గును ఉపయోగించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారంట.




