లండన్‌లోని హైకమిషన్ ఆఫీస్‌కు టీమిండియా.. కోహ్లీ, గంభీర్ మధ్య ఆసక్తికర సీన్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు లండన్‌లో ఘన స్వాగతం లభించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని భారత హైకమిషన్ శనివారం టీమిండియాకు ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, ప్రవాస భారతీయులు పాల్గొని సందడి చేశారు. బీసీసీఐ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. లండన్‌లో చిరస్మరణీయ సాయంత్రంగా అభివర్ణించింది. భారత హైకమిషనర్ కుమారన్ పెరియసామి జట్టుకు స్వాగతం పలకగా, యూకేలోని భారతీయ సమాజ సభ్యులు ఆటగాళ్లను ఆత్మీయంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. భారత క్రికెట్ చరిత్రలోని ఎన్నో గొప్ప విజయాలను గుర్తు చేశారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా జట్టులోని ఆత్మవిశ్వాసం, ఐక్యత గురించి మాట్లాడారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ప్రవాస అభిమానులతో ముచ్చటించి వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఈ సమావేశంలో పాల్గొని అభిమానులతో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమం లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరగనున్న మూడో వన్డేకు ఒక రోజు ముందు జరిగింది. తొలి రెండు వన్డేలు హోరాహోరీగా సాగడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. దీంతో ఆదివారం జరగనున్న మ్యాచ్ సిరీస్ విజేతను డిసైడ్ చేయనుంది.
కోహ్లీ, గంభీర్ మధ్య నవ్వులు..
కాగా ఈ కార్యక్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నవ్వుతూ మాట్లాడుకోవడం విశేషంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇద్దరి మధ్య మాటలు లేవని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. టీమిండియా బ్యాటింగ్ కోచ్ దీనిపై స్పందిస్తూ.. లేదు అలాంటిదే లేదు.. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అని క్లారిటీ ఇచ్చిన ఎవరూ పెద్దగా నమ్మలేదు. కానీ ఈ రోజు సీన్స్ చూసి.. హమ్మయ్యా ఇద్దరు బాగానే ఉన్నారంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఒక వైపు రోహిత్, మరో వైపు కోహ్లీ మధ్యలో గంభీర్ కూర్చున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
A memorable evening in London as #TeamIndia visited the High Commission.
The players and support staff were welcomed by the High Commissioner of India to the UK, Mr Kumaran Periasamy, and members of the Indian diaspora in the UK.
BCCI Vice-President Mr Rajeev Shukla also… pic.twitter.com/RfBaQxaTey
— BCCI (@BCCI) July 19, 2026
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
