July 20, 2026

అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ ఫైనల్‌కు గూగుల్ డూడుల్.. మ్యాచ్ కోసం ఇంటరాక్టివ్ సర్‌ప్రైజ్!

అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ ఫైనల్‌కు గూగుల్ డూడుల్.. మ్యాచ్ కోసం ఇంటరాక్టివ్ సర్‌ప్రైజ్!
Reading Time: 2 minutes

అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ ఫైనల్‌కు గూగుల్ డూడుల్.. మ్యాచ్ కోసం ఇంటరాక్టివ్ సర్‌ప్రైజ్!

Caption of Image.

FIFA World Cup Final: అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ మధ్య జరగబోయే చారిత్రాత్మక 2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను సెలబ్రేట్ చేస్తూ గూగుల్ ఒక కలర్‌ఫుల్, ఇంటరాక్టివ్ డూడుల్‌ను ఆవిష్కరించింది. ఈ ప్రత్యేకమైన విజువల్ ఆర్ట్‌వర్క్ అర్జెంటీనాకు చెందిన క్లాసిక్ స్కై బ్లూ, స్పెయిన్‌కు చెందిన ఫైరీ రెడ్ కలర్స్‌తో మారుతూ అభిమానుల్లో జోష్ నింపుతోంది. గూగుల్ లోగోలోని రెండు “O” అక్షరాల స్థానంలో తిరుగుతున్న ఫుట్‌బాల్‌తో పాటు ఇరు దేశాల జాతీయ చిహ్నాలను క్రేజీగా డిజైన్ చేసింది. ఈ డూడుల్‌పై క్లిక్ చేస్తే చాలు లైవ్ స్కోర్లు, టోర్నమెంట్ బ్రాకెట్ అప్‌డేట్స్ అన్నీ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

మెస్సీ వర్సెస్ యామల్:  
న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరగబోయే ఈ హై-ప్రొఫైల్ మ్యాచ్‌పై అంచనాలు ఆకాశాన్నంటాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ నేతృత్వంలో టైటిల్ డిఫెన్స్ కోసం బరిలోకి దిగుతుండగా, బలమైన డిఫెన్స్‌తో దూసుకొచ్చిన స్పెయిన్ జట్టు యువ సంచలనం లామిన్ యామల్ పవర్‌తో కప్ కొట్టాలని పట్టుదలగా ఉంది. బ్యూనస్ ఐరిస్ నుంచి మాడ్రిడ్ వీధుల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ లవర్స్ సోషల్ మీడియాలో ఏఆర్ (AR) ఫిల్టర్స్ వాడుతూ తమ దేశ రంగులతో నెట్టింట రచ్చ చేస్తున్నారు.

చరిత్రలో తొలిసారి ఫిఫా హాఫ్‌టైమ్ షో: 
ఈసారి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆటతో పాటు మరో మైండ్ బ్లోయింగ్ విజువల్ వండర్ చోటు చేసుకోబోతుంది. ఫిఫా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అధికారికంగా ఫిఫా వరల్డ్ కప్ 2026 టాప్స్ ఫైనల్ హాఫ్‌టైమ్ షో (Halftime Show) ను నిర్వహించనున్నారు. కోల్డ్‌ప్లే బ్యాండ్ ప్రసిద్ధ సింగర్ క్రిస్ మార్టిన్ క్యూరేట్ చేస్తున్న ఈ మెగా షోలో గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్స్ మడోన్నా, షకీరా, జస్టిన్ బీబర్, కే-పాప్ సంచలనం బీటీఎస్ (BTS) ఒకే వేదికపై రచ్చ చేయనున్నారు. వీరికి తోడుగా నైజీరియన్ సింగర్ బర్నా బాయ్, ప్రఖ్యాత కండక్టర్ గుస్తావో దుదామెల్ కూడా లైవ్ పర్ఫార్మెన్స్‌తో స్టేజ్‌ను షేక్ చేయబోతున్నారు.

ALSO READ : ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ ఎఫెక్ట్.. కేరళలో రేపు స్కూళ్లు, కాలేజీలు క్లోజ్!

$100 మిలియన్ల నిధుల సేకరణే లక్ష్యం: 
ఈ హాఫ్‌టైమ్ షో కేవలం వినోదం కోసమే కాకుండా ఒక గొప్ప సామాజిక ఆశయంతో ముడిపడి ఉంది. ఈ ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయాన్ని ఫిఫా గ్లోబల్ సిటిజన్ ఎడ్యుకేషన్ ఫండ్ (FIFA Global Citizen Education Fund) కు సాయంగా అందించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి ఫుట్‌బాల్ ఆడేందుకు అవసరమైన క్రీడా అవకాశాలను కల్పించడానికి ఈ నిధి ద్వారా దాదాపు 100 మిలియన్ డాలర్లను సేకరించాలని ఫిఫా టార్గెట్ గా పెట్టుకుంది. అటు మెస్సీ రికార్డుల వేట, ఇటు గ్లోబల్ స్టార్ల మ్యూజిక్ కాంబోతో ఈ ఆదివారం రాత్రి ఫుట్‌బాల్ హిస్టరీలోనే నిలిచిపోనుంది. 

©️ VIL Media Pvt Ltd.