July 21, 2026

ఆర్టీసీ విలీనంపై మాట తప్పం..కార్మిక సంఘాల ఎన్నికల అనంతరం ప్రక్రియను ప్రారంభిస్తం: మంత్రి పొన్నం

ఆర్టీసీ విలీనంపై మాట తప్పం..కార్మిక సంఘాల ఎన్నికల అనంతరం ప్రక్రియను ప్రారంభిస్తం: మంత్రి పొన్నం
Reading Time: < 1 minute

ఆర్టీసీ విలీనంపై మాట తప్పం..కార్మిక సంఘాల ఎన్నికల అనంతరం ప్రక్రియను ప్రారంభిస్తం: మంత్రి పొన్నం

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ విలీన ప్రక్రియపై ఇచ్చిన మాట తప్పేది లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  స్పష్టం చేశారు. సమ్మె సమయంలో ఆత్మహత్య చేసుకున్న  డ్రైవర్ శంకర్  కుటుంబానికి.. ఆర్టీసీ ఉద్యోగులు అందించిన ఆర్థికసాయంతో పాటు మొత్తం రూ.90,85,500 చెక్కును సోమవారం ఆర్టీసీ కళా భవన్ లో జరిగిన కార్యక్రమంలో శంకర్ భార్య హేమలత, కొడుకు హేమంత్, కుమార్తె షాలినికి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శంకర్  కొడుకుకు ఆర్టీసీలో ఉద్యోగం, కుటుంబానికి ఇల్లు మంజూరు చేశామన్నారు. ఆర్టీసీ కార్మికుల కోసం ప్రాణత్యాగం చేసిన డ్రైవర్ శంకర్ కుటుంబానికి ఆర్టీసీ ఉద్యోగులంతా అండగా నిలవడం అభినందనీయమన్నారు.

సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల సౌలభ్యం, కార్మికుల సంక్షేమం అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. కార్మిక సంఘాల ఎన్నికల అనంతరం నలుగురు మంత్రులు, అధికారుల కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. క్యూర్  ఏరియాలో అత్యాధునిక బస్  టెర్మినల్ ను నిర్మిస్తామని, గ్రామాల నుంచి రాజధాని వరకు కొత్త రూట్లలో బస్సులు నడుపుతూ.. మెట్రో, ఎంఎంటీఎస్ సర్వీసులతో ఆర్టీసీని అనుసంధానం చేసి రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.