July 21, 2026

Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!

Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
Reading Time: 2 minutes
Paneer Tikka Recipe Make Restaurant Style Protein Rich Paneer Tikka Easily At Home

Paneer Tikka Recipe: సాధారణంగా రెస్టారెంట్లలో దొరికే పన్నీర్ టిక్కాని చూసి ఇంట్లో చేయడం కష్టమేమో అనుకుంటారు. కానీ సరైన కొలతలతో మసాలా కలుపుకుంటే, ఓవెన్ ఉన్నా లేకపోయినా తవ్వా పైనైనా సరే చాలా పర్ఫెక్ట్‌గా చేసేసుకోవచ్చు. ముఖ్యంగా డైట్ చేస్తున్నవారు, శరీరానికి మంచి ప్రోటీన్ అందాలి అనుకునేవారు ఈ రెసిపీని హ్యాపీగా తినవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే.. ఈ ‘పన్నీర్ టిక్కా’ని అతి తక్కువ సమయంలో ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..

కావలసిన పదార్థాలు:

* పన్నీర్ – అర కిలో. (టిక్కా సైజు ముక్కలు)
* పెరుగు – 2 టేబుల్ స్పూన్లు
* అల్లం వెల్లుల్లి పేస్ట్ – కొద్దిగా
* ధనియాల పొడి – తగినంత
* గరం మసాలా – తగినంత
* కారం, ఉప్పు, పసుపు – రుచికి సరిపడా
* శెనగపిండి – 2 స్పూన్లు (బైండింగ్ కోసం)
* ఆవాల నూనె – 2 స్పూన్లు
* కసూరి మేతి – కొద్దిగా
* క్యాప్సికం, ఉల్లిపాయలు – ముక్కలుగా కోసినవి

తయారీ విధానం:

* ముందుగా ఒక ప్లేట్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, శెనగపిండి, ఆవాల నూనె, కసూరి మేతి ఇలా అన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా పర్ఫెక్ట్ గా కుదిరిందో లేదో ఒకసారి రుచి చూడండి.

* ఆ తరువాత కలిపిన మసాలాని ఒక పక్కకు జరిపి, పన్నీర్ ముక్కలకు మసాలా బాగా పట్టించాలి. శెనగపిండి వేయడం వల్ల మసాలా పన్నీర్‌కు బాగా పట్టుకుంటుంది. మసాలా పట్టించిన పన్నీర్ ముక్కలను పక్కన పెట్టుకుని, మిగిలిన మసాలాలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికం (అందుబాటులో ఉంటే ఎల్లో, రెడ్ క్యాప్సికమ్స్ లేదా మష్రూమ్స్ కూడా వాడుకోవచ్చు) వేసి బాగా కలపాలి.

* చిన్న టూత్ పిక్స్ లేదా లేదా కడ్డీలను తీసుకుని వరుసగా ఉల్లిపాయ, క్యాప్సికం, పన్నీర్ ముక్కలను గుచ్చాలి.

* అలా చేసిన వాటిని ట్రేలో ఉంచి ఓవెన్‌లో 220°C ఉష్ణోగ్రత వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేయాలి. కొంచెం బర్న్ మార్క్స్ (నల్లటి మచ్చలు) కావాలనుకుంటే మరొక 5 నిమిషాలు ఎక్కువ ఉంచవచ్చు. (ఓవెన్ లేనివారు తవ్వా పైన కూడా ఫ్రై చేసుకోవచ్చు). అంతే.. కేవలం 15 నిమిషాల్లో వేడివేడిగా, గుమగుమలాడే పన్నీర్ టిక్కా రెడీ.