July 22, 2026

Mega 158: 35 ఏళ్ల తర్వాత ప్రాణ స్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. మెగా 158లో విలన్‌గా ఎవరూ ఊహించని నటుడు

Mega 158: 35 ఏళ్ల తర్వాత ప్రాణ స్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. మెగా 158లో విలన్‌గా ఎవరూ ఊహించని నటుడు
Reading Time: 2 minutes
Mega 158: 35 ఏళ్ల తర్వాత ప్రాణ స్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. మెగా 158లో విలన్‌గా ఎవరూ ఊహించని నటుడు

ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడీ జోష్ ను కంటిన్యూ చేస్తూ త్వరలోనే ‘విశ్వంభర’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారీ సీనియర్ హీరో. వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ కే.ఎస్.రవీంద్ర (బాబీ) డైరెక్షన్ లో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడిదే కాంబో మరోసారి రానుండడంతో మెగా 158 (వర్కింగ్ టైటిల్) పై భారీ అంచనాలు ఉన్నాయి. జన నాయగన్, టాక్సిక్ వంటి భారీ సినిమాలను తెరకెక్కించిన కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ అధినేత వెంకట్‌ కె. నారాయణ ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మెగా మూవీలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. అలాగే నివేతా పేతురాజ్‌, ప్రియమణి ఇతర కీలక పాత్రల్లో యాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ మెగా 158 సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి ప్రాణస్నేహితుడు విలన్ గా నటించనున్నారట. అది కూడా 35 ఏళ్ల తర్వాత. ఆ ప్రాణ స్నేహితుడు మరెవరో కాదు శరత్ కుమార్.

మెగా 158 సినిమాలో శరత్ కుమార్ ఓ పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నారట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. చిరంజీవి, శరత్ కుమార్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. శరత్ కుమారే స్వయంగా ఈ విషయాన్ని పలు సందర్భాల్లో తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవి తన ప్రాణ స్నేహితుడని ఫైనాన్షియల్‌గానూ తనకు చాలా సార్లు హెల్ప్ చేశారని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఆయనతో కలిసి పనిచేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటానని, అయితే సరైన స్క్రిప్ట్ రాకపోవడంతో చాలా రోజులుగా చిరంజీవితో కలిసి నటించలేకపోయానని ఈ సీనియర్ నటుడు చెప్పుకొచ్చారు.

కాగా అప్పుడెప్పుడో 1990ల్లో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి, శరత్ కుమార్ కలిసి నటించారు. ఈ సినిమా ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత ‘స్టూవర్ట్‌పురం పోలీస్ స్టేషన్’ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి నటించడానికి దాదాపు 35 ఏళ్లు పట్టింది.

శరత్ కుమార్ లేటెస్ట్ ఫొటోస్..