లా చదివినోళ్లకు గుడ్ న్యూస్.. ట్రైనింగ్లోనే రూ.56 వేల జీతంతో ఆర్మీలో ఉద్యోగాలు

లా గ్రాడ్యుయేట్లకు ఇండియన్ ఆర్మీలో చేరేందుకు మంచి అవకాశం. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఎంట్రీ స్కీమ్ 125వ కోర్సు (2027, ఏప్రిల్) కింద జడ్జ్ అడ్వకేట్ జనరల్ (జేఏజీ) బ్రాంచ్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఆర్మీ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అవివాహితులైన పురుషులు, మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పోస్టు పేరు: షార్ట్ సర్వీస్ కమిషన్ (జేఏజీ) కోర్స్.
మొత్తం ఖాళీలు: 10.
ఎలిజిబిలిటీ: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హత కలిగి ఉండాలి.
క్లాట్ పీజీ–2026 స్కోర్ తప్పనిసరి.
ఎల్‌ఎల్‌ఎమ్ పూర్తిచేసిన వారైనా లేదా ప్రస్తుతం చదువుతున్న వారైనా క్లాట్ పీజీ–2026 స్కోర్ కలిగి ఉండాలి. ఇతర ఏ సంవత్సరపు క్లాట్ పీజీ స్కోర్లను పరిగణనలోకి తీసుకోరు.
వయోపరిమితి: 2027, జనవరి 1 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. 2000, జనవరి 2 కంటే ముందు 2006, జనవరి 1 తర్వాత గానీ జన్మించి ఉండకూడదు.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 17.
ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
లాస్ట్ డేట్: ఆగస్టు 17.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు షార్ట్ లిస్టింగ్: సెప్టెంబర్ రెండో వారం.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ: డిసెంబర్/ నవంబర్.
సెలెక్షన్ ప్రాసెస్
షార్ట్‌లిస్టింగ్: క్లాట్ పీజీ–2026 స్కోర్, అందుబాటులో ఉన్న ఖాళీల నిష్పత్తి ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
ఎస్‌ఎస్‌బీ సెంటర్ & తేదీల ఎంపిక: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు తమ ఎస్‌ఎస్‌బీ సెంటర్, ఇంటర్వ్యూ తేదీలను ఫస్ట్- కమ్ -ఫస్ట్ -సర్వ్ (ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత) పద్ధతిలో ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి తేదీ, కేంద్రాన్ని ఖరారు చేసుకున్న తర్వాత మార్చుకోవడానికి వీలుండదు.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ: ప్రయాగ్‌రాజ్, భోపాల్, బెంగళూరు లేదా జలంధర్ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. రెండు దశల్లో జరిగే ఇంటర్వ్యూ ప్రక్రియ గరిష్టంగా ఐదు రోజులపాటు కొనసాగుతుంది. ఇందులో స్టేజ్–1లో ఉత్తీర్ణత సాధించని అభ్యర్థులను అదే రోజు వెనక్కి పంపించేస్తారు.
మెడికల్ ఎగ్జామినేషన్: స్టేజ్–2 ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని, తదుపరి దశకు సిఫారసు అయిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
మెరిట్ లిస్ట్ & శిక్షణ: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. ఖాళీలు, అర్హతల ప్రాతిపదికన ఎంపికైన అభ్యర్థులకు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ)లో ప్రీ-కమిషన్ శిక్షణ కోసం జాయినింగ్ లెటర్స్ పంపుతారు.
శిక్షణ కాలంలో స్టైపెండ్: చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ)లో శిక్షణ పొందుతున్న సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్ లభిస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్టినెంట్ హోదాతో విhttp://www.joinindianarmy.nic.inధుల్లోకి తీసుకుంటారు. లెఫ్టినెంట్ నుంచి బ్రిగేడియర్ హోదా వరకు నెలకు అదనంగా రూ. 15,500 మిలిటరీ సర్వీస్ పే అందుతుంది.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.joinindianarmy.nic.inను సందర్శించండి.