అందెశ్రీ, గద్దరన్నతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు: సీఎం రేవంత్ రెడ్డిCaption of Image.
అందెశ్రీ, గద్దరన్నలతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దరన్నను ఎర్రటి ఎండలో కూర్చోబెట్టింని.. గద్దరన్నను అవమానించిన రోజే దొరల గడీలను బద్ధలు కొట్టాలని ప్రజలు నిర్ణయించారని అన్నారు. శనివారం (జులై 18) కవి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్ కేసర్ లో ఆయన స్మృతి వనానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి శంకుస్థాపన చేసిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ కామెంట్స్:
ఒక మిత్రుడి ఇంటిలో అందెశ్రీని కలిశా
అందెశ్రీ నాకు ఆత్మబంధువుగా మారాడు, కుటుంబ సభ్యుడు అయ్యాడు
అందెశ్రీ నాకు పెద్దన్న.. అందెశ్రీ నాకు స్ఫూర్తి
అందశ్రీ ఎప్పుడూ దొరల గడీల ముందు నిలబడలేదు
అందెశ్రీ పదాలపై పదాలు పేర్చి జయ జయహే తెలంగాణ గీతం రచించారు
అందెశ్రీ పాటలు లక్షలాది మంది విద్యార్థులను ఉద్యమకారులుగా మార్చాయి
తెలంగాణ యువత మర ఫిరంగులు కావడానికి అందెశ్రీ పాటలే కారణం
అందెశ్రీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది
అందెశ్రీ పాట, పదాలను నిర్మూలించాలని చూశారు
దొరల గడీల ముందు నిలబడనని ధైర్యంగా చెప్పిన కవి అందశ్రీ
తెలంగాణ ఉద్యమకారులను మా ప్రభుత్వం గౌరవిస్తోంది
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు అమలు చేస్తున్నాం
నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని వరుస నోటిఫికేషన్లతో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నం