పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!

మానవ-వన్యప్రాణి సంఘర్షణ పరాకాష్టకు చేరుకుందని నిరూపిస్తూ, నేపాల్‌లో ఒక విస్మయకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పాములు పగబడతాయనే నమ్మకం ఉన్నప్పటికీ, ఇప్పుడు ఏనుగులు కూడా పగబడుతాయనే వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. సినిమాల్లో కనిపించే విధంగా, ధ్రుబే అనే ఏనుగు సరిగ్గా పద్నాలుగేళ్ల తర్వాత తిరిగి వచ్చి ఒకే కుటుంబంలో నలుగురిని బలితీసుకుంది.నేపాల్‌లోని చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో నివసించే శనిచర బోటే కుటుంబం ఈ విషాదానికి గురైంది. 2012 డిసెంబర్‌లో ధ్రుబే ఏనుగు దాడిలో శనిచర తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు. ఆ భయంతో తన ప్రాణాలు కాపాడుకోవడానికి శనిచర, రాప్తి నది దాటి తొమ్మిది మైళ్ళ దూరంలోని జగత్‌పూర్‌కు వలస వెళ్ళాడు. ఇంత దూరం వస్తే ఏనుగు భయం ఉండదని భావించాడు.కానీ విధి విచిత్ర నాటకంలో భాగంగా, పద్నాలుగేళ్ల తర్వాత అదే ధ్రుబే ఏనుగు జగత్‌పూర్‌కు చేరుకుని శనిచర ఇంటిపై దాడి చేసింది. ఈ తాజా దాడిలో అతని కోడలు ఆషికా బోటే, నాలుగేళ్ల మనవడు భరత్ బోటే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క ఏనుగే 2010 నుండి ఇప్పటివరకు ఏకంగా 25 మందిని పొట్టన పెట్టుకుంది. దీని భయానక చరిత్రపై వికీపీడియాలో ఒక ప్రత్యేక పేజీ కూడా ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
ఇండస్ట్రీలో అక్కినేని హీరోల టైం మొదలైందా..?
విజయ్ ‘జన నాయగన్’ ఓపెనింగ్స్ పై ఆసక్తి
టాలీవుడ్‌లో యాక్షన్ లవ్ స్టోరీల ట్రెండ్
తెలంగాణ పల్లె కథల వైపు టాలీవుడ్ చూపు