Reading Time: < 1 minute

ఆగస్టులో నయనతార హాయ్‌‌‌‌ మూవీ రిలీజ్…

Caption of Image.

యశ్ సినిమా ‘టాక్సిక్‌‌‌‌’లో నయనతార కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆగస్టు 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఇదే నెలలో ఆమె నటించిన మరో సినిమా రిలీజ్‌‌‌‌ కాబోతోంది. నయనతార,  కవిన్‌‌‌‌ లీడ్ రోల్స్‌‌‌‌లో నటించిన చిత్రం ‘హాయ్‌‌‌‌’.  ఇదొక ఫీల్‌‌‌‌ గుడ్‌‌‌‌ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్.. విష్ణు ఎడవన్‌‌‌‌ దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార సొంత నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌‌‌‌తో కలిసి సెవెన్ స్క్రీన్ స్టూడియోస్, జీ స్టూడియో సంస్థలు  నిర్మిస్తున్నాయి. జెన్ మార్టిన్ సంగీతం అందించాడు.  సోమవారం ఈ మూవీ రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌ చేశారు.  ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొస్తున్నట్టు తెలియజేశారు. 

ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రోమో వీడియో ఆకట్టుకుంది. వర్షం పడుతుంటే బస్‌‌‌‌స్టాప్‌‌‌‌లో ఒక చేతిలో సంచి, మరొక చేతిలో వేట కొడవలితో అమాయకంగా కనిపించింది నయనతార. తన కోసం బైక్‌‌‌‌పై వచ్చిన కవిన్‌‌‌‌ ఆమె చేతిలో ఉన్న వేట కొడవలితో హాయ్‌‌‌‌ చెప్పడం చూసి అవాక్కయ్యాడు.  

ఇద్దరూ కలిసి వర్షంలో బైక్‌‌‌‌పై వెళుతున్నట్టు చూపించారు. ‘మీ మనసును దోచుకునే  కథ ఆగస్టు 14న రాబోతోంది’ అంటూ రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ ప్రకటించారు.  రెండు వారాల గ్యాప్‌‌‌‌తో, రెండు వేర్వేరు జానర్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆడియన్స్‌‌‌‌కు హాయ్ చెప్పబోతోంది నయనతార.  ‘టాక్సిక్‌‌‌‌’లో గంగ అనే అల్ట్రా మోడర్న్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్న ఆమె, ‘హాయ్’లో శారీతో ఇన్నోసెంట్‌‌‌‌లుక్‌‌‌‌తో ఆకట్టుకుంటోంది.  

©️ VIL Media Pvt Ltd.