July 20, 2026

మెనోరేజియా లక్షణాలు ఇవే… మహిళలు తప్పక తెలుసుకోవాలి!

మెనోరేజియా లక్షణాలు ఇవే… మహిళలు తప్పక తెలుసుకోవాలి!
Reading Time: 2 minutes

మహిళల ఆరోగ్యానికి సంబంధించి పీరియడ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. అయితే, చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో జరిగే అధిక రక్తస్రావాన్ని (మెనోరేజియా) సాధారణ విషయంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. గైనకాలజిస్టుల ప్రకారం, ఈ సమస్య వెనుక కొన్ని తీవ్రమైన ఆరోగ్య కారణాలు ఉండవచ్చు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీని ముఖ్యమైన లక్షణాలు ఏంటో మరియు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో  ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం.

అధిక రక్తస్రావానికి కారణాలు ఇవే: మహిళల్లో పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడానికి శరీరంలో జరిగే హార్మోన్ల అసమతుల్యత ప్రధాన కారణం కావచ్చు. దీంతో పాటు గర్భాశయ ఫైబ్రాయిడ్స్ (చిన్న గడ్డలు), అడెనోమయోసిస్ (గర్భాశయ లోపలి పొర విపరీతంగా పెరగడం) వంటి సమస్యల వల్ల కూడా బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. ఇక అలాగే శరీరంలో రక్తం తక్కువగా ఉండటం అంటే అనీమియా (రక్తహీనత) వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది.

Menorrhagia Symptoms Every Woman Should Know
Menorrhagia Symptoms Every Woman Should Know

నిర్లక్ష్యం చేయకూడని ముఖ్య లక్షణాలు: పీరియడ్స్ సాధారణంగా 3 నుండి 5 రోజులు ఉండి ఆగిపోతాయి. కానీ, ఎవరికైనా సరే 7 రోజులకు మించి నిరంతరాయంగా రక్తస్రావం జరుగుతుంటే దానిని అస్సలు లైట్ తీసుకోకూడదు. అలాగే, బ్లీడింగ్ అయ్యేటప్పుడు 2.5 సెంటీమీటర్ల కంటే పెద్ద పరిమాణంలో రక్తం గడ్డలు  పడుతున్నా.. అది మెనోరేజియా తీవ్రతకు బలమైన సంకేతం అని గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

ఆహారంలో ఈ మార్పులు అవసరం: పీరియడ్స్ సమయంలో రక్తం ఎక్కువగా పోవడం వల్ల శరీరం నీరసించిపోతుంది. కాబట్టి, ఈ సమస్య ఉన్న మహిళలు తమ డైట్‌లో ఐరన్ (ఇనుము) మరియు విటమిన్-సి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి. ఇక ఐరన్ వల్ల శరీరంలో కొత్త రక్తం తయారవుతుంది, విటమిన్-సి ఆ ఐరన్‌ను శరీరం సరిగ్గా గ్రహించుకునేలా సహాయపడుతుంది.

పీరియడ్స్ సమస్యలను దాచడం లేదా భరించడం వల్ల భవిష్యత్తులో ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 7 రోజులు దాటినా బ్లీడింగ్ అవ్వడం, పెద్ద గడ్డలు పడటం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అప్రమత్తమై సరైన ఆహారం తీసుకుంటూ, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందడం చాలా ముఖ్యం.

గమనిక: ఈ సమాచారం నిపుణుల సూచనలు మరియు సాధారణ అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపునొప్పి, నీరసం లేదా పైన పేర్కొన్న లక్షణాలు ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

The post మెనోరేజియా లక్షణాలు ఇవే… మహిళలు తప్పక తెలుసుకోవాలి! appeared first on Manalokam – Latest Telugu News & Updates.