July 21, 2026

హైదరాబాద్ కోర్టు కీలక తీర్పు: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

హైదరాబాద్ కోర్టు కీలక తీర్పు: పోక్సో కేసులో నిందితుడికి  20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
Reading Time: < 1 minute

హైదరాబాద్ కోర్టు కీలక తీర్పు: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

Caption of Image.

మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో హైదరాబాద్ 12వ అదనపు సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రేమ పేరుతో నమ్మించి ఒక నిరుపేద మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది.

పోక్సో (POCSO) చట్టం కింద నమోదైన ఈ కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు  తీర్పునిచ్చింది. దీంతో పాటు రూ. 10 వేల జరిమానా కూడా విధించింది. ఒకవేళ ఈ జరిమానా చెల్లించకపోతే, నిందితుడు మరో 6 నెలల పాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

 2021లో కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం వెలుగుచూసింది. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అత్యంత వేగంగా దర్యాప్తు పూర్తి చేశారు. నిందితుడిపై ఉన్న అభియోగాలను రుజువు చేసేందుకు  పక్కా సాంకేతిక ఆధారాలను కోర్టుకు సమర్పించారు.

పోలీసులు సమర్పించిన టిష్టమైన ఆధారాలను పరిశీలించిన గౌరవ న్యాయస్థానం.. నిందితుడిని దోషిగా తేల్చి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితురాలికి న్యాయం జరిగేలా పక్కా ఆధారాలతో నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసు అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.

©️ VIL Media Pvt Ltd.