టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. భారత్ జట్టుకి బుమ్రా దూరం.. ఎందుకో తెలుసా!

IND vs ENG: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో టాస్ ప్రక్రియ ముగిసింది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మొదటగా బ్యాటింగ్ తీసుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపించడంతో, ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయాలని ఇంగ్లీష్ టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక 3వ వన్డేకి ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మోకాలి గాయం(Knee Injury) కారణంగా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Boom) ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. మేము టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ తీసుకునే వాళ్లం.. ఈ మ్యాచ్‌లో నలుగురు సీమర్లతో ఆడాలని ప్రణాళిక వేసుకున్నాం.. గత మ్యాచ్‌లో మేము మంచి పొజిషన్‌లో ఉన్నప్పటికీ, వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఆ తప్పులను సరిదిద్దుకుంటామని వెల్లడించాడు.
ALSO READ : రోహిత్, కోహ్లీ ఫ్యూచర్‌పై బిగ్ డిస్కషన్..
ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. లార్డ్స్ పిచ్ బ్యాటింగ్‌కు చాలా బాగుంది.. గత మ్యాచ్‌లో జో రూట్ (Rooty) బ్యాటింగ్ చేసిన తీరు మాకు ఒక పక్కా టెంప్లేట్‌ను అందించింది.. ఈ మ్యాచ్‌లో కూడా పిచ్ పరిస్థితులను త్వరగా అంచనా వేసి బోర్డుపై భారీ స్కోరు ఉంచాలని భావిస్తున్నామని తెలిపాడు.
జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లాండ్: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్
🚨 Toss 🚨
England have won the toss and elected to bat first in the 3️⃣rd ODI.
Updates ▶️ https://t.co/pLZ2PvDH5G#TeamIndia | #ENGvIND pic.twitter.com/uZ2XqxneZb
— BCCI (@BCCI) July 19, 2026
Presenting #TeamIndia‘s Playing XI for the 3️⃣rd ODI 🙌
Jasprit Bumrah had an impact injury on his left knee while fielding in the second ODI in Cardiff. He was not available for selection for the third ODI due to reactive swelling in his left knee.
Updates ▶️… pic.twitter.com/RJdchL62hv
— BCCI (@BCCI) July 19, 2026