ఆయనకు రాజీనామా లేఖ రాయరాదు.. అందుకే చేస్తలేడు: కేంద్ర మంత్రిపై ఎంపీ సెటైర్లు

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని యువత ఆందోళన చేస్తుంటే ఆయన మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని అన్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. సీజేపీ ఆందోళనలు, పోలీసుల లాఠీఛార్జీపై మంగళవారం (జులై 21) మాట్లాడిన ఆమె.. ధర్మేంద్ర ప్రధాన్ పై విరుచుకుపడ్డారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రికి రాజీనామా లేఖ రాయడం రాదేమో.. అందుకే రిజైన్ చేయడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మెర్సీ పిటిషన్స్ పై (దయాదాక్షిణ్యాల మీద ) ఎలా రాయోలో మాత్రమే ఆరెస్సెస్ నేర్పిస్పిందున ఎక్స్ లో పోస్ట్ చేశారు.
సోమవారం (జులై 20) కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఛలో పార్లమెంట్ హింసాత్మకంగా మారిన సందర్భంలో.. పోలీసుల అమానుష దాడిని ఖండిస్తూ ఆమె ఈ విధంగా మాట్లాడారు.
భారీ వర్షం, టైట్ సెక్యూరిటీ, పోలీసుల ఆంక్షల మధ్య ఆందోళనలు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. పోలీసుల లాఠీఛార్జిలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. .
Maybe just maybe the Education Minister doesn’t know how to write a letter of resignation…. RSS only teaches you how to write mercy petitions .
— Mahua Moitra (@MahuaMoitra) July 21, 2026