July 21, 2026

అనారోగ్యంతో అల్లుడు.. గుండెపోటుతో అత్త మృతి.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఘటన

అనారోగ్యంతో అల్లుడు.. గుండెపోటుతో అత్త మృతి.. కరీంనగర్ జిల్లా  కొత్తపల్లిలో ఘటన
Reading Time: < 1 minute

అనారోగ్యంతో అల్లుడు.. గుండెపోటుతో అత్త మృతి.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఘటన

Caption of Image.

జమ్మికుంట, వెలుగు : అల్లుడు అనారోగ్యంతో చనిపోగా.. అతడి మరణం తట్టుకోలేని అత్త గుండెపోటుతో చనిపోయింది. ఈ ఘటన కరీంనగర్​జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే… ఇల్లందకుంట గ్రామానికి చెందిన బూర్ల రంజిత్(36) కొత్తపల్లిలో ఉంటున్నాడు. ఇతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం సాయంత్రం మందుల కోసమని మెడికల్ షాప్ కు వెళ్లగా… అక్కడే పడి చనిపోయాడు. విషయం తెలుసుకున్న అతడి అత్త గుండేటి పద్మ (56) ఘటనాస్థలానికి చేరుకొని రంజిత్ పై పడి ఏడుస్తూ గుండెపోటుతో కుప్పకూలి 
చనిపోయింది. 
 
©️ VIL Media Pvt Ltd.