July 20, 2026

Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!

Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
Reading Time: 2 minutes
Prabhas Spirit Kalki 2 Fauji Simultaneous Shoots

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత బిజీగా ఉన్నారు. సాధారణంగా స్టార్ హీరోలందరూ ఏడాదికి ఒక సినిమా పూర్తి చేయడానికే ఎక్కువ సమయం తీసుకుంటున్న ఈ సమయంలో, ప్రభాస్ మాత్రం ఏకకాలంలో మూడు భారీ ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేస్తూ కొత్త బెంచ్‌మార్క్ సృష్టిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2’, హను రాఘవపూడి డైరెక్షన్‌లో వస్తున్న ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్‌లతో డార్లింగ్ బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’షూటింగ్ వేగంగా సాగుతోంది. బాలానగర్, చంచల్‌గూడ ప్రాంతాల్లో కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో 60 శాతానికి పైగా పూర్తైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి 2’ కూడా ఈ నెల నుంచి నాన్‌స్టాప్ షెడ్యూల్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీ, శంకర్‌పల్లి పరిసరాల్లో భారీ సెట్లలో షూటింగ్ జరుగుతోందని సమాచారం. ఫ్యూచరిస్టిక్ ప్రపంచంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ పూర్తిగా భిన్నమైన లుక్, బాడీ లాంగ్వేజ్‌తో కనిపించనున్నారట.

ఇక హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ సినిమా కూడా చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. టాకీ పార్ట్ దాదాపు పూర్తవగా ప్రస్తుతం కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇంకా సుమారు 25 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా, డిసెంబర్ 3న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూడు చిత్రాలు మూడు విభిన్న ప్రపంచాలకు చెందినవి కావడం విశేషం. ‘స్పిరిట్’లో ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్, ‘కల్కి 2’లో ఫ్యూచరిస్టిక్ వారియర్, ‘ఫౌజీ’లో పీరియాడిక్ నేపథ్యంలో సాగే పాత్ర.. ఇలా ప్రతి సినిమాలో గెటప్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ స్టైల్, భావోద్వేగాలు పూర్తిగా వేర్వేరుగా ఉండనున్నాయి. ఒకేసారి ఈ మూడు పాత్రలను సమర్థంగా బ్యాలెన్స్ చేయడం ప్రభాస్ ముందున్న అతిపెద్ద సవాలుగా మారిందని చెబుతున్నారు. అయితే తన ప్లానింగ్, క్రమశిక్షణతో ఈ మూడు చిత్రాలను సమాంతరంగా పూర్తి చేస్తున్న ప్రభాస్ మరోసారి తన వర్క్ కమిట్‌మెంట్‌ను నిరూపిస్తున్నారని ట్రేడ్ వర్గాలు కొనియాడుతున్నాయి. అయితే ఈ మూడు సినిమాలతో వరుస విజయాలు అందుకుని బాక్సాఫీస్‌పై మరోసారి ప్రభాస్ తన ఆధిపత్యాన్ని చాటుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.