Weekend Thrillers: ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపలేరు.. జీ5లో ఈ 3 థ్రిల్లర్స్ నెక్స్ట్ లెవెల్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే ప్రతి కథలోనూ కొత్త ట్విస్ట్, కొత్త మిస్టరీ ఉంటుంది. ఇలా డిఫెరెంట్ స్టోరీ బ్యాక్ డ్రాప్లతో తెరకెక్కిన ఓ మూడు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లు ఈ వీకెండ్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒకవైపు వ్యవస్థతో పోరాటం, మరోవైపు హనీమూన్ వెళ్లిన చోటే దారుణ హత్య, ఇంకోవైపు ఒక హౌసింగ్ సొసైటీలో నవ్వులు పూయిస్తూనే సాగే మర్డర్ మిస్టరీ. ఇపుడు ఈ అంశాలతోనే ఓ మూడు సస్పెన్స్ థ్రిల్లెర్స్ మీ వీకెండ్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలన్నీ జీ5లో తెలుగులో డబ్బింగ్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి స్టోరీ బ్యాక్డ్రాప్ ఏంటనేది ఓ లుక్కేద్దాం.
హాథ్రస్: 16 డేస్ (Hathras: 16 Days)
స్టోరీ: దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఒక ఘోరమైన యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథ నడుస్తుంది. ఒక అట్టడుగు వర్గానికి చెందిన అమ్మాయిపై జరిగిన అన్యాయం, దాని చుట్టూ రాజకీయం, పోలీసులు సృష్టించిన అడ్డంకులు.. వీటన్నింటి మధ్య ఆ కుటుంబం న్యాయం కోసం చేసిన 16 రోజుల పోరాటమే ఈ గ్రిప్పింగ్ డ్రామా. వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూ సాగే ఈ ఇన్వెస్టిగేషన్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. కాగా 2020లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ హాథ్రస్ అత్యాచార ఘటన ఆధారంగా ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ను డైరెక్టర్ పాట్రిక్ గ్రాహం రూపొందించారు.
హనీమూన్ సే హత్య (Honeymoon Se Hatya)
స్టోరీ: పెళ్లయిన కొత్త జంట ఎన్నో ఆశలతో, సంతోషంగా హనీమూన్ ట్రిప్‌కు వెళ్తుంది. అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో, ఊహించని విధంగా అక్కడ ఒక దారుణమైన హత్య జరుగుతుంది. ఆనందంగా గడపాల్సిన హనీమూన్ కాస్తా మర్డర్ మిస్టరీ’గా మారుతుంది. అసలు ఆ హత్య చేసింది ఎవరు? భార్యా? భర్తా? లేక మూడో వ్యక్తి ఉన్నాడా? అనే పాయింట్ చుట్టూ తిరిగే ఉత్కంఠభరితమైన సీన్లు మిమ్మల్ని టీవీ స్క్రీన్‌కు కట్టిపడేస్తాయి. ఇది కూడా నిజ జీవితంలో జరిగిన కొన్ని దారుణ ఉదంతాల ఆధారంగా తెరకెక్కింది. మొత్తం 6 ఎపిసోడ్లతో డాక్యుమెంటరీ ఓటీటీ సిరీస్ గా తెలుగులో అందుబాటులో ఉంది.
సన్‌ఫ్లవర్ – సీజన్ 2 (Sunflower 2)
స్టోరీ: ‘సన్‌ఫ్లవర్’ హౌసింగ్ సొసైటీ అంటేనే వింత మనుషులు, అంతకు మించిన కామెడీ. హీరోయిన్ ఆదా శర్మ కీలక పాత్రలో నటించిన ఈ సీజన్-2 లో సస్పెన్స్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుంది. అమాయకంగా కనిపిస్తూ అందరినీ ఇరికించే సోనూ (సునీల్ గ్రోవర్) చుట్టూ ఈసారి మర్డర్ ఇన్వెస్టిగేషన్ మరింత సీరియస్‌గా మారుతుంది. కొత్త క్యారెక్టర్ల ఎంట్రీతో, నవ్వులు పూయిస్తూనే.. ‘అసలు కిల్లర్ ఎవరు?’ అనే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సీజన్ సాగుతుంది. మొత్తం 8 ఎపిసోడ్లలో మూవీ జీ5లో స్ట్రీమ్ అవుతుంది.