July 11, 2026

Weather Alert: ఒక్కసారిగా మారిన వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వానలు.. వెదర్ రిపోర్ట్ చూశారా..?

Weather Alert: ఒక్కసారిగా మారిన వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వానలు.. వెదర్ రిపోర్ట్ చూశారా..?
Reading Time: 2 minutes
Weather Alert: ఒక్కసారిగా మారిన వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వానలు.. వెదర్ రిపోర్ట్ చూశారా..?

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు వేడి తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్నారు.. ఈ తరుణంలో ఉపశమనం కలిగించేలా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఆంధప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న మధ్యప్రదేశ్ లోని నైరుతి ప్రాంతం నుండి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు మరాత్వాడ ప్రాంతం నుండి కర్ణాటక తీర ప్రాంతం, ఉత్తర అంతర్గత కర్ణాటక, మధ్య మహారాష్ట్రల మీదుగా ఆగ్నేయ అరేబియన్ సముద్ర ప్రాంతం, సమీపంలోని లక్ష దీవులు ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది.

దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజులకు వాతావరణ (Weather Forecast) సూచనలు:

శనివారం, ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సోమవారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగి తదుపరి నాలుగు రోజుల్లో క్రమేపి రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings):

శనివారం, ఆదివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ వాతావరణం – వర్షాలు కురిసే అవకాశం..

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:-

శనివారం, ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

రాయలసీమ :-

శనివారం ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

గమనిక :- కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం, రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..