July 12, 2026

kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు

kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
Reading Time: < 1 minute
Rising Remunerations Of Kannada Heroes Yash And Rishab Shetty Charging Over %e2%82%b9100 Crores

ఒకప్పుడు కేవలం కర్ణాటకకే పరిమితమైన కన్నడ సినిమా సత్తా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తోంది. ముఖ్యంగా ‘కేజీఎఫ్’, ‘కాంతార’ వంటి చిత్రాల తర్వాత కన్నడ హీరోల క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఈ క్రేజ్‌కు తగ్గట్టుగానే ఇప్పుడు అక్కడి స్టార్ హీరోలు భారీ స్థాయిలో పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ సిరీస్‌తో యశ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ టాక్సిక్కోసం యశ్ సుమారు రూ. 50 నుండి 70 కోట్లు చార్జ్ చేశాడని టాక్. అంతేకాకుండా  బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’లో రావణాసురుడి పాత్ర పోషిస్తున్నందుకు గానూ యశ్ ఏకంగా రూ. 100 కోట్లదాకా తీసుకున్నది బాలీవుడ్ సమాచారం. ఒక కన్నడ హీరో ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం విశేషం.

‘కాంతార’ సినిమాతో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందారు. ‘కాంతార: చాప్టర్ 1’ కోసం దాదాపు రూ. 100 కోట్లు పారితోషికంగా పుచ్చుకుంటున్నారని సమాచారం. దీనికి తోడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో వస్తున్న జై హనుమాన్ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నందుకు గానూ రిషబ్ రూ. 80 కోట్లు తో పాటు కొంత లాభాలలో వాటా కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమాలు తీస్తూనే మార్కెట్ వాల్యూను పెంచుకుంటూ కన్నడ హీరోలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ల జాబితాలో చేరుతున్నారు. కన్నడ సినిమాల స్పాన్ పెరగడం, అక్కడి హీరోలకు ఇతర భాషల్లో కూడా మార్కెట్ ఉండడంతో హీరోలు అడిగినంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.