Reading Time: < 1 minute

విజయ్ రాజకీయం మొదలు.. టీవీకేలోకి మన్నార్గుడి ఎమ్మెల్యే కామరాజ్ !

Caption of Image.

చెన్నై: విజయ్ టీవీకే పార్టీలో చేరేందుకు మన్నార్గుడి ఎమ్మెల్యే కామరాజ్ పావులు కదుపుతున్నారు. టి.టి.వి దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ నుంచి ఎస్.కామరాజ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 15 వందల 66 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి, డీఎంకే అభ్యర్థి రాజా T.R.Bని కామరాజ్ ఓడించారు. కామరాజ్కు అనుకూలంగా 68 వేల 416 ఓట్లు పోలయ్యాయి. టీవీకే పార్టీలో కామరాజ్ చేరబోతున్నాడనే ప్రచారం తమిళ మీడియాలో జోరుగా నడుస్తుంది.

కామరాజ్ టీవీకేలో చేరితే విజయ్ పార్టీ బలం 108 నుంచి 109కి పెరుగుతుంది. DMDK ఎమ్మెల్యే ప్రేమలత విజయకాంత్‌ కూడా విజయ్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. విజయ్‌ తమ కుటుంబ సభ్యుడని, విజయ్‌ మొదటి నుంచి కెప్టెన్‌తోనే ఉన్నారని – ప్రేమలత చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో హాట్ టాపిక్గా మారాయి. కెప్టెన్ విజయకాంత్ భార్య ప్రేమలత కూడా విజయ్ పార్టీలో చేరితే విజయ్ పార్టీ బలం 110కి చేరుతుంది.

ALSO READ : విజయ్ని దెబ్బ కొట్టిన 17 అసెంబ్లీ నియోజకవర్గాలు..

హీరో విజయ్ చాలా తక్కువ టైంలోనే రాజకీయాల్లో అద్భుత ఫలితాన్ని సాధించారు. ఆయన 2024 ఫిబ్రవరి 2నే తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని ప్రకటించారు. 2024 ఆగస్టు 22న పార్టీ జెండాను, గీతాన్ని ఆవిష్కరించారు. 2024 అక్టోబర్ 27న టీవీకే సిద్ధాంతాలను విజయ్ ప్రకటించారు. ఈ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం 2026 జనవరి 22న అధికారికంగా ‘విజిల్’ గుర్తును కేటాయించింది. అంటే టీవీకే పార్టీకి గుర్తును 3 నెలల క్రితమే కేటాయించారు.

అయినప్పటికీ  రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ప్రజలకు తన పార్టీ గుర్తును, అజెండాను చేరవేయడంలో విజయ్ సక్సెస్ అయ్యారు. సిద్ధాంతాలు, వారసత్వ రాజకీయాలు, చీలిక గ్రూపుల ద్వారా కాకుండా, ఒక నటుడు తనకున్న ప్రజాదరణను పక్కా రాజకీయ వ్యూహంగా మార్చి ఇంతటి విజయాన్ని అందుకోవడం విశేషం. కోట్లాది మంది అభిమానులు, బలమైన కేడర్ కలిగిన విజయ్ నాయకత్వంలో టీవీకే సృష్టించిన ఈ రాజకీయ ప్రకంపనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

©️ VIL Media Pvt Ltd.