
వర్సటైల్ ఇండియన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, లేటెస్ట్గా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్‌తో వార్తల్లో నిలిచారు. తమిళనాడు రాజకీయాలపై స్పందిస్తూ ఆయన ఓ పాత ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం. కరుణానిధి ఒక సినిమా ప్రారంభోత్సవంలో రిబ్బన్ కట్ చేస్తుండగా, ఆయన వెనుక కుర్రాడిగా నటుడు విజయ్ కనిపిస్తున్నారు.
ఈ ఫోటోను ఉద్దేశించి వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ.. “తన వెనుక నిలబడ్డ ఈ కుర్రాడు ఒక రోజు తన పార్టీ (DMK)నే సవాల్ చేస్తాడని, అంతేకాకుండా నాశనం చేసే స్థాయికి ఎదుగుతాడని కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు” అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఆర్జీవీ షేర్ చేసిన ఈ ఫోటో తమిళ సినీ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. ఏదేమైనా ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందించే వర్మ, మరోసారి స్ట్రాంగ్ ఫొటోతో విజయ్కి విషెష్ అందించడం విశేషం.
ALSO READ : విజయ్ రాజకీయం మొదలు..
Kalaingar wouldn’t have dreamed that the kid behind him would one day destroy his party 🙏👍🔥 pic.twitter.com/7NNp6Ge73S
— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2026
దళపతి సీఎం విజయ్..
విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ భారీ విజయంతో తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించింది. తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ రెండు చోట్ల పోటీ చేసిన విజయ్.. రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయంతో సీఎం పీఠం కైవసం చేసుకోనున్నారు. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ మొత్తం 234 సీట్లకుగాను108 సీట్లలో జయకేతనం ఎగురవేసింది.
అయితే, టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు)కు మరో10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. అంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సిఉంది. దీంతో ఏ కూటమి నుంచి మద్దతు కూడగట్టాలనే విషయంపై విజయ్ ఆలోచనలో పడ్డారు.