Reading Time: 2 minutes
Abhishek Sharma 135 Not Out Vs Dc Ipl 2026 Records Broken Fastest Indian Centuries And Stats

Abhishek Sharma: మంగళవారం (ఏప్రిల్ 21) హైదరాబాద్‌ లో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ పై అతడు 68 బంతుల్లో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీనితో SRH జట్టును 242/2 అనే భారీ స్కోర్‌కు తీసుకెళ్లాడు. నితీష్ రాణా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ ఈ ఐపీఎల్ లో రెండో సెంచరీని అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు ఐపీఎల్ చరిత్రలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. మరి అవేంటో చూసేద్దామా..

Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం!

50 బంతుల లోపు సెంచరీలు చేసిన తొలి భారతీయుడు:
ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో 50 బంతుల లోపు రెండు సెంచరీలు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో 2025లో పంజాబ్ కింగ్స్ పై కేవలం 40 బంతుల్లో చేసిన సెంచరీతో ఇప్పటికే రికార్డు సృష్టించాడు. ఈ ఘనతతో విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు.

ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:
అభిషేక్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల టాప్ 5 జాబితాలో మరోసారి చోటు సంపాదించాడు. టాప్ 5 అత్యధిక వ్యక్తిగత స్కోర్ల లిస్ట్ ఇదిగో..
175* – క్రిస్ గేల్
158* – బ్రెండన్ మెకల్లమ్
141 – అభిషేక్ శర్మ (2025)
140* – క్వింటన్ డి కాక్
135* – అభిషేక్ శర్మ (2026)
ఈ జాబితాలో రెండు సార్లు చోటు సంపాదించిన ఏకైక ఆటగాడు కూడా అభిషేక్ కావడం విశేషం.

OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం

భారతీయులలో అత్యధిక స్కోర్లు:
ఐపీఎల్‌లో భారతీయ బ్యాటర్లలో అత్యధిక స్కోర్లు సాధించిన బ్యాటర్ కూడా అభిషేక్ పేరిటే ఉన్నాయి.
141 (55) – పంజాబ్ కింగ్స్‌పై (2025)
135* (68) – ఢిల్లీ క్యాపిటల్స్‌పై (2026)

ఈ సీజన్‌లో అభిషేక్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్రలోనే వేగవంతమైన అర్ధశతకం (15 బంతుల్లో) సాధించాడు. పవర్‌ప్లేల్లో దూకుడు ప్రదర్శనతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ను కూడా తన సహచరుడు హేన్రిచ్ క్లాసేన్ ను దాటి అందుకున్నాడు.