Reading Time: < 1 minute
Srh Vs Csk Ipl 2026 No Ms Dhoni Csk Make Two Changes For Uppal Clash

CSK playing XI vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో మరికొద్ది గంటల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు కారణం క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ. గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడని మహీ.. ఎస్‌ఆర్‌హెచ్‌పై బరిలోకి దిగుతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే నేటి మ్యాచ్‌లో కూడా ధోనీ ఆడడం లేదని తెలుస్తోంది. ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌కు సీఎస్‌కే ప్లేయింగ్ ఎలెవెన్‌లో రెండు మార్పులు ఉండనునట్లు తెలుస్తోంది.

గాయంతో దూరమైన పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో ముకేష్ చౌదరి జట్టులోకి రానున్నాడని సమాచారం. కొత్త బంతిని ముకేష్, అన్షుల్ కాంబోజ్ పంచుకోనున్నారు. వీరికి తోడుగా గుర్జప్నీత్ సింగ్ ఉన్నాడు. అయితే మరో కీలక పేసర్ నాథన్ ఎలిస్ గైర్హాజరీతో సీఎస్‌కే బౌలింగ్ కాస్త బలహీనంగా మారింది. హైదరాబాద్ పిచ్‌పై ఈ కొత్త కాంబినేషన్ ఎలా రాణిస్తుందో చూడాలి. ఓపెనింగ్ జోడీ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. రుతురాజ్ గైక్వాడ్ తన పేలవ ఫామ్ ఉన్నప్పటికీ ఓపెనర్‌గా కొనసాగనున్నాడు. అతనితో పాటు సంజు శాంసన్ మరోసారి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.

Also Read: Slum Dog Release: పూరీ-విజయ్ ‘స్లమ్‌ డాగ్’ రిలీజ్ ఆలస్యం.. అసలు కారణం ఏంటో తెలుసా?

అభిమానులకు పెద్ద షాక్ ఏమిటంటే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. కాలు కండరాల గాయం నుంచి కోలుకుంటున్న ధోనీ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదట. పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలుస్తోంది. రాబోయే కొన్ని మ్యాచ్‌ల్లో ఆయన తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మహీ ఇంకా డగౌట్‌లోనే ఉండనున్నాడు. ధోనీ హైదరాబాద్ వచ్చాడని తెలిసి సంబరపడ్డ అభిమానులకు నిరాశ తప్పేలా లేదు.