Reading Time: < 1 minute
Suriya 48 Suriya Turns Doctor In Tj Gnanavels Film Shooting Progresses

కోలీవుడ్ వర్సటైల్ నటుడు సూర్య ఇటీవల వచ్చిన కరుప్పు సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫైనల్ రన్ లో రూ. 350 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఆ సినిమా హిట్ తో జోష్ మీదున్న సూర్య నెక్ట్స్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఈ గ్యాప్ లో తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ చేసాడు సూర్య. ఈ నేపథ్యంలో ‘జై భీమ్’ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు సూర్య.

భారీ బడ్జెట్ పై సూర్య కెరీర్ లో 48వ సినిమాగా తెరకెక్కుతున్నఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రస్తుతం  చెన్నైలోని ఎగ్మోర్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో సూర్య, కథానాయిక కయాదు లోహర్ లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్య ఒక డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ‘కేజీఎఫ్’, ‘కాంతార’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హొంబాలే ఫిల్మ్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ‘జై భీమ్’ వంటి నేషనల్ లెవెల్ సెన్సేషన్ తర్వాత సూర్య – జ్ఞానవేల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై సినీ వర్గాల్లోనూ అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.