
వర్షాకాలం మొదలైంది. పిల్లలు పుల్లగా.. కారంగా ఉండే పదార్దాలంటే చాలా ఇష్టపడతాయి. పదే పది నిమిషాల్లో గొట్టం మిక్చర్ పెడితే లొట్టేసుకుంటూ లాగించేస్తారు. రుచితో . మైమరిపించే పుల్లగా తినే ఫుడ్స్ గొట్టం మిక్చర్ గతంలో పల్లెటూర్లలో ఎక్కువగా తింటారు. ఇక ఇప్పుడు పట్టణాల్లో కూడా బాగా ట్రెండ్ అవుతోంది. నిమ్మరసం, మసాలాల కలయికతో చేసే ఈ గొట్టం మిక్చర్ తింటే ఎగిరి గంతులేయాల్సిందే. మరి ఇంతటి హేపీ మూడ్ ను కలుగజేసే గొట్టం మిక్చర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .
గొట్టం మిక్చర్ తయారీకి కావాల్సిన పదార్దాలు
- గొట్టాలు : మూడు కప్పులు
- నిమ్మకాయ : ఒకటి
- ఉప్పు : ఒక టేబుల్ స్పూన్
- మరమరాలు: రెండు కప్పులు
- మిరియాల పొడి : ఒక టేబుల్ స్పూన్
- జీలకర్ర పొడి : ఒక టేబుల్ స్పూన్
- ఒక టేబుల్ స్పూన్
- చాట్ మసాలా : అర కప్పు పుదీనా ఆకులు ,
- కొత్తిమీర : అర కట్ట
- పచ్చిమిర్చి ముక్కలు: ఒక చిన్న కప్పు
- ఉల్లిపాయ ముక్కలు : ఒక కప్పు
మసాలా మిక్స్ తయారీ విధానం
ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఉప్పు, మర మరాలు, గొట్టాలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చెయ్యాలి. ఇలా చేసి తింటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ మిశ్రమం తయారైన తరవాత ఒక గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మరసాన్ని రెడీ చేసుకోవాలి.
►ALSO READ | జ్యోతిష్యం : ఆగస్టులో కీలక గ్రహాల మార్పుతో సూర్యగ్రహణం .. జరిగే మార్పులు ఇవే..!
నిమ్మరసాన్ని ఒక చిన్న గ్లాస్ తీసుకోవాలి. ఇది రుచిని పెంచుతుంది. ఇక ఇప్పుడు మట్టి పాత్ర తీసుకుని దానిలో గొట్టం మిక్చర్ వేసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం వేసి చేతితోనే బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
ఈ గొట్టం మిక్చర్ వలన ఎన్నో లాభాలు : దీనిలో ఉండే పులుపు, కారం పిల్లల్లో ఉండే అలసట, నీరసం కూడా తగ్గిస్తుంది. ఇంకా జీర్ణక్రియ పని తీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఇది స్ట్రీట్ స్టైల్ టేస్ట్ తో రుచిగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే పది నిమిషాల్లో చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు పిల్లలకు ఎంతో బలమైన ఫుడ్ తక్కువ ఖర్చుతో చేసి పెట్టండి.. ఇష్టంగా లాగిస్తారు.