
నిజామాబాద్: బాకీ తీర్చాలని ఒత్తిడి చేయడంతో.. కంకర రాళ్లకు బంగారం పూత పూసి ఇచ్చి మోసం చేసిన ఘటన నిజామాబాద్లో హాట్ టాపిక్ అయింది. నిజామాబాద్ నగరంలోని హమాల్వాడీకి చెందిన రమేష్ దగ్గర శ్రీనివాస్ లక్షా 30 వేల అప్పు తీసుకున్నాడు.
అప్పు తీర్చాలని శ్రీనివాస్పై రమేష్ ఒత్తిడి తెచ్చాడు. తనకు గుప్తనిధులు దొరికాయని, అందులో బంగారం రాళ్లు ఉన్నాయని శ్రీనివాస్ చెప్పాడు. బంగారు రాళ్లను అప్పు కింద పట్టుకోమని రమేష్ను శ్రీనివాస్ నమ్మించాడు.
నిజామాబాద్‌లో కాకుండా డిచ్‌పల్లి మండలం ఘన్ పూర్‌కి అదనంగా రూ.32 వేలు తీసుకొని రావాలని రమేష్కు శ్రీనివాస్ చెప్పాడు. నాలుగు కుండల్లో నాలుగు బంగారం రాళ్లను రమేష్కు శ్రీనివాస్ ఇచ్చాడు. అనుమానం వచ్చి చూడగా.. కంకర రాళ్లకు బంగారం రంగు పూత పూసినట్లు బాధితుడు రమేష్ గుర్తించాడు. మోసపోయానని గ్రహించి డిచ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
►ALSO READ | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు