Reading Time: < 1 minute
Urmila Matondkar Ram Gopal Varma Marriage Claims

Jyoti Venkatesh: బాలీవుడ్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన నటి ఊర్మిళా మాతోండ్కర్, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)ల అనుబంధంపై మళ్లీ కొత్త చర్చ మొదలైంది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగిందనే వార్తలు దశాబ్దాలుగా చెక్కర్లు కొడుతున్నాయి. అయితే బాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఊర్మిళా మాతోండ్కర్, రామ్ గోపాల్ వర్మకు వివాహమైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సిద్ధార్థ్ కనన్ పోడ్‌కాస్ట్‌లో జ్యోతి వెంకటేష్ ఈ విషయాలను వెల్లడించారు. ఒకసారి ఓ ప్రముఖ తెలుగు హీరో తనను కలిసినప్పుడు, ఆర్జీవీ-ఊర్మిళా పెళ్లి చేసుకున్న విషయం ఎందుకు రాయడం లేదని అడిగారట. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఆలయంలో వీరి పెళ్లి జరిగిందని చెబుతూ, ఆ వివాహం జరిపించిన పూజారి ఫోన్ నంబర్ కూడా ఇచ్చారట. ఈ వార్తను ప్రచురించే ముందు తాను ఊర్మిళకు ఫోన్ చేయగా, ఆమె ఏడుస్తూ తనపై అసంతృప్తి వ్యక్తం చేసింది తప్ప పెళ్లి జరగలేదని ఖండించలేదట. మరోవైపు ఆర్జీవీని ప్రశ్నించగా ఆయన దీనిపై మాట్లాడటానికి నిరాకరించారట. వీళ్లు విడిపోవడానికి కారణాలను సైతం జ్యోతి వెంకటేష్ వివరించారు. ఊర్మిళ ఆర్జీవీతో చట్టబద్ధంగా (లీగల్‌గా) పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలని కోరుకుందని, కానీ ఆర్జీవీ దానికి సిద్ధపడకపోవడంతో ఇద్దరూ విడిపోయారని తెలిపారు.

ఇదిలా ఉండగా.. ‘అంతం’, ‘గాయం’, ‘రంగీలా’, ‘సత్య’.. ఇలా రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు పొందిన నటి ఊర్మిళా మాతోండ్కర్‌ (Urmila Matondkar). హిట్‌ కాంబినేషన్‌గా నిలిచిన వీరిద్దరు ఆ తర్వాత మళ్లీ కలిసి పనిచేయకపోవడంపై బాలీవుడ్‌లో పలు ఊహాగానాలు వచ్చాయి. అయితే.. గతేడాది ‘సత్య’ రీ రిలీజ్‌ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘మీ మధ్య విభేదాలా?’ అనే ప్రశ్న ఎదురవగా ఊర్మిళా మాతోండ్కర్‌ స్పందించారు. డైరెక్టర్‌తో అభిప్రాయభేదాల్లేవని స్పష్టం చేశారు.