
గోవాలోని వాగేటర్ బీచ్‌లో సముద్రంలో చిక్కకున్న టయోటా ఫార్చ్యూనర్‌కు సంబంధించిన వైరల్ ఘటన ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఫర్చూనర్ కారును సముద్రంలోకి నడిపింది తానేనని ఓ హోటల్ సిబ్బంది ఒప్పుకున్నాడు.
వాగేటర్ బీచ్‌లోని సముద్రపు అలల మధ్య వైట్ కలర్ ఫార్చ్యూనర్ ఇరుక్కుపోయిన దృశ్యాలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. మొదట కారు యజమానిపై విమర్శలు రాగా, ఇప్పుడు ఒక హోటల్ వర్కర్ సీన్ లోకి వచ్చాడు.కారును బీచ్‌లోకి నడిపింది తానేనని, దానికి యజమానికి ఎలాంటి సంబంధం లేదని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపారు. కారును శుభ్రం చేయమని తనకు అప్పజెప్పారని అయితే ఒనర్ అనుమతి లేకుండానే బీచ్ కు తీసుకెళ్లినట్టు ఒప్పుకున్నాడు. గుజరాత్ కు చెందిన కారు ఓనర్ఆ టైంలో అక్కడి లేరని వాహనాన్ని నిషిద్ద ప్రాంతానికి తీసుకెళ్లడం ఆయనకు తెలియదని చెబుతూ దీనికి సంబంధించి ఓ వీడియోను రిలీజ్‌చేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో కొద్దిరోజులక్రితం వైరల్ అయింది. సముద్రపు నీటిలో సగం మునిగిపోయిన ఫార్చ్యూనర్ దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. అక్కడున్న పర్యాటకులు టయోటా హైలక్స్ (Toyota Hilux)తో వాహనాన్ని లాగడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో, చివరకు జేసీబీ (JCB) యంత్రం సహాయంతో దానిని తీరానికి చేర్చారు. అయితే నిషిద్ద ప్రాంతంలో కారును నడిపినందుకు ఓనర్ పై కేసును నమోదు చేసి చర్యలకు సిద్దమయ్యారు పనాజీ పోలీసులు.
Chapris took their Fortuner car on a beach in Goa to ‘wash’ it
Strong waves took the car in & it was struck on beach, later rescue teams were called to rescue them
What is the solution of these chapris ?pic.twitter.com/xPZtSN22X0
— Frontalforce 🇮🇳 (@FrontalForce) March 24, 2026