Reading Time: < 1 minute

యుద్ధానికి బ్రేక్ ఆశలతో దూసుకుపోతున్న గోల్డ్: హైదరాబాదులో తాజా రేట్లివే..

Caption of Image.

ఇరాన్ యుద్ధానికి బ్రేక్ పడుతుందనే వార్తలతో బంగారం రేట్లు ఒక్కసారిగా తిరిగి ర్యాలీ స్టార్ట్ చేశాయి. యుద్ధం ఆగి సీజ్ ఫైర్ దిశగా చర్చలు జరుగుతున్నాయనే వార్తలతో గోల్డ్ తిరిగి పెరగటం ఇన్వెస్టర్లలో ఆశలు చిగురింపజేస్తోంది. దాదాపుగా రెండు వారాల నుంచి క్రమంగా తగ్గుతూపోతున్న గోల్డ్ రేట్లు చివరికి మళ్లీ పెరగటంపై తెలుగు రాష్ట్రాల్లో కొనుగోలుదారులు పెదవి విరుస్తున్నారు. బంగారం కొనాలని అనుకుంటున్న వ్యక్తులు ముందుగా తమ నగరాల్లో పెరిగిన రేట్లను పరిశీలించటం చాలా ముఖ్యం. 

మార్చి 25న బంగారం రేట్లు భారీగానే పెరిగింది. మార్చి 24 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.376 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 667గా కొనసాగుతోంది.

ALSO READ : కంటికి కన్ను కాదు.. తల తీసేస్తాం

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లను పరిశీలిస్తే మార్చి 25న పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో మార్చి 24 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.345 పెరిగాయి. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 445గా ఉంది. 

©️ VIL Media Pvt Ltd.