July 15, 2026

Tamil Nadu: ఉచితంగా ఫ్రిజ్.. పురుషులకు బస్ ఫ్రీ.. అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల

Tamil Nadu: ఉచితంగా ఫ్రిజ్.. పురుషులకు బస్ ఫ్రీ.. అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల
Reading Time: < 1 minute
Tamil Nadu Aiadmk Manifesto Free Fridge Bus Travel Men Schemes

తమిళనాడులో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. అధికారం కోసం ఎవరికి వారే వాగ్ధానాలు ఇస్తున్నారు. తాజాగా అన్నాడీఎంకే పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ప్రజాకార్షక హామీలతో ముందుకొచ్చింది.

అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా ఫ్రిజ్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది. మహిళల మాదిరిగానే పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇక రూ.25 వేల రాయితీతో 5 లక్షల మంది మహిళా ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు అందిస్తామని వెల్లడించింది. అలాగే ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొంది. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇక జల్లికట్లు యోధుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం.. సామాజిక భద్రతా పింఛను రూ.2 వేలకు పెంచింది. అలాగే రేషన్‌కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు ఉచితంగా కిలో పప్పు, కిలో మంచి నూనె అందిస్తామని వరాల జల్లు కురిపించింది.

తమిళనాడులో ఒకే విడత పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.