Reading Time: < 1 minute
Biggest Ipl Deal Ever Rajasthan Royals Sold For Rs 15000 Crore

Rajasthan Royals Sold out: ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద డీల్ జరిగింది. 1.63 బిలియన్ డాలర్ల (రూ. 15,286 కోట్లు)కు రాజస్థాన్ రాయల్స్ జట్టును అమెరికాకు చెందిన వ్యాపారవేత్త “కల్ సోమాని” సొంతం చేసుకున్నారు. కల్ సోమానికి చెందిన ‘కన్సార్టియం’ రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీలోని 100% వాటాను పూర్తి చేసింది. సోమాని.. ఇంట్రాఎడ్జ్ (IntraEdge), అకాడెమియన్ (Academian), ట్రుయో.ఏఐ (Truyo.AI) సంస్థల వ్యవస్థాపకుడు.

నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

ఆయనకు వాల్‌మార్ట్ కుటుంబానికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త రాబ్ వాల్టన్, నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) జట్టు ‘డెట్రాయిట్ లయన్స్’లో మెజారిటీ వాటాలు ఉన్న హాంప్ కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. షీలా ఫోర్డ్ హాంప్‌కు ఫోర్డ్ మోటార్ కంపెనీ సహ-యజమానులైన ఫోర్డ్ కుటుంబంతో కూడా ఈ డీల్ లో సంబంధాలు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన డీల్. ఈ డీల్ తో రాజస్థాన్ రాయల్స్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా నిలవనుంది. ఈ యాజమాన్య మార్పు ఐపీఎల్ 2026 తర్వాత అమలులోకి వస్తుంది.

Fake Doctor : 10th ఫెయిల్ కానీ.. 20 ఏళ్లుగా BDS డాక్టర్‌గా ట్రీట్‌మెంట్‌..

మరోవైపు జట్టులో ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌ మొత్తానికి దూరం కావడంతో.. అతని స్థానంలో శ్రీలంక ఆల్రౌండర్, టీ20 కెప్టెన్ దసున్ శనకను జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడిన సామ్ కరన్, రవీంద్ర జడేజాతో కలిసి రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ అయ్యారు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై జట్టు.. వీరిద్దరికీ బదులుగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను దక్కించుకుంది.