July 15, 2026

Sequel Trend: తక్కువ గ్యాప్‌లో వచ్చిన క్రేజీ సీక్వెల్ సినిమాలివే

Sequel Trend: తక్కువ గ్యాప్‌లో వచ్చిన క్రేజీ సీక్వెల్ సినిమాలివే
Reading Time: < 1 minute
Durandhar Movie Strategy Fast Sequels Trend Indian Cinema

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా ‘దురంధర్’ సినిమా గురించే చర్చ జరుగుతోంది. కేవలం 104 రోజుల వ్యవధిలో రెండు భాగాలను విడుదల చేసి, రెండింటితోనూ భారీ విజయాలను అందుకోవడం మామూలు విషయం కాదు. ఈ సినిమా సాధించిన వసూళ్ల సునామీతో ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. ఫ్రాంచైజీ సినిమాలు తీసే మేకర్స్ అందరూ ఇప్పుడు ‘దురంధర్’ స్ట్రాటజీని ఫాలో అవ్వాలని అనుకుంటున్నారు. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే, దాని సీక్వెల్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడటం మనకు అలవాటు. కానీ, అతి తక్కువ సమయంలోనే పార్ట్-2ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం. అయితే ఈ ట్రెండ్ ‘దురంధర్’తోనే మొదలైందని అనుకుంటే పొరపాటే! గతంలో కూడా పలువురు దర్శకులు ఇలాంటి ప్రయోగాలు చేశారు.

Also Read:Deva Katta: పవర్ స్టార్‌తో సినిమా.. దేవాకట్టా రియాక్షన్ ఇదే!

భారీ చిత్రాలైన ‘బాహుబలి’, ‘KGF’ వంటివి పార్ట్-2 కోసం సంవత్సరాల సమయం తీసుకున్నాయి. కానీ, అంతకంటే వేగంగా వచ్చిన చిత్రాల జాబితా ఆశ్చర్యకరంగా ఉంది. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ విషయంలో రికార్డ్ సృష్టించారు. కేవలం 42 రోజుల గ్యాప్‌లో రక్త చరిత్ర రెండు భాగాలను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల మధ్య కేవలం 44 రోజుల విరామం మాత్రమే ఉంది. బాలీవుడ్ క్లాసిక్ క్రైమ్ డ్రామాగా నిలిచిన అనురాగ్ కశ్యప్ గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ రెండు భాగాలు 47 రోజుల వ్యవధిలోనే వచ్చాయి. కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసిన రక్షిత్ శెట్టి సప్త సాగరదాచే ఎల్లో రెండు భాగాలు 78 రోజుల గ్యాప్‌లో విడుదలై ప్రేక్షకులను అలరించాయి. మరోవైపు, మణిరత్నం విజువల్ వండర్ ‘పొన్నియిన్ సెల్వన్’ కూడా రెండు భాగాలను ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకుని, కేవలం 210 రోజుల వ్యవధిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఒక సినిమా చూసిన తర్వాత ఆ కథపై ఉండే ఆసక్తి (Curiosity) తగ్గిపోకముందే రెండో భాగాన్ని తీసుకురావడం వల్ల ప్రేక్షకులకు కథతో కనెక్టివిటీ పోదు. ‘దురంధర్’ విషయంలో ఇదే జరిగింది. పక్కా ప్లానింగ్, షూటింగ్ షెడ్యూల్స్ ముందే పూర్తి చేసుకోవడం వల్ల మేకర్స్ ఈ ఫీట్‌ను సాధించగలిగారు.