July 15, 2026

Mohanlal New Movies: లాలట్టన్ లైనప్‌ మాములుగా లేదుగా.. యంగ్ హీరోలు కూడా సాటిరారు!

Mohanlal New Movies: లాలట్టన్ లైనప్‌ మాములుగా లేదుగా.. యంగ్ హీరోలు కూడా సాటిరారు!
Reading Time: 2 minutes
Mohanlal Upcoming Movies 2026 Lalettans Massive Lineup Beats Young Stars

Mohanlal Upcoming Movies in 2026: లాస్ట్ ఇయర్ మోహన్ లాల్ చూపించిన హవా అంతా ఇంతా కాదు. ‘ఎల్2 ఎంపురన్’, ‘తుడరుమ్’, ‘హృదయ పూర్వం’తో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ చిత్రాలను టేస్ట్ చేశారు. కానీ ‘వృషభ’ టోటల్ హ్యాపీనెస్‌ను స్మాష్ చేసేసింది. వృషభ ఆల్ట్రా డిజాస్టరైనా.. లాలట్టన్ లైనప్‌కు వచ్చిన ఢోకా లేదు. ఇంకా చెప్పాలంటే.. మరింత బిజీగా మారుతున్నారు.

2025 మోహన్ లాల్ నామ సంవ్సతరం అనొచ్చు. ఒకటి కాదు రెండు కాదు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో హిట్స్ అందుకున్నారు. ఎల్2 ఎంపురన్, తుడరుమ్ ఆయన కెరీర్‌లోనే కాదు.. మాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాలుగా నిలిచాయి. లోక రానంత వరకు ఎంపురన్ హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్. హృదయ పూర్వం కూడా వంద కోట్ల క్లబ్‌లోకి చేరడంతో లాలట్టన్ ఆనందానికి అవధుల్లేవ్. మాలీవుడ్ చిత్రాలు కంప్లీట్ స్టార్ గ్రాఫ్ అమాంతం పెరిగితే.. భారీ బడ్జెట్ చిత్రాలు కన్నప్ప, వృషభ హ్యాట్రిక్ హిట్ కొట్టానన్న హ్యాపీనెస్ కూల్చేశాయి. కన్నప్పలో క్యామియో కాబట్టి లైట్ తీసుకున్నా.. వృషభ మాత్రం గట్టి దెబ్బే వేసింది. మరోసారి లాలట్టన్‌కు భారీ చిత్రాలు కలిసి రావన్న ముద్ర పడింది.

బొమ్మ డిజాస్టరైనా మోహన్ లాల్ ఆఫర్స్‌కు వచ్చిన ఢోకాలేదు. జీతూ జోసెఫ్‌తో దృశ్యం-3 తో పాటు తన దోస్త్ మమ్ముట్టితో కలిసి పేట్రియాట్ మల్టీస్టారర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇవే కాదు ఆయన లైనప్ చూస్తే మాలీవుడ్ యంగ్ హీరోలు కూడా సాటిరారు. సీనియర్ అండ్ యంగ్ డైనమిక్ దర్శకులతో కొలబరేట్ అవుతూ.. టూ జనరేషన్స్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు మోహన్ లాల్. తుడరుమ్‌తో తనకు మాసివ్ హిట్టిచ్చిన తరుణ్ మూర్తితో ఎల్366 చేస్తున్న లాలట్టన్.. సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్‌ 100వ సినిమాకు ఓకే చెప్పారు.

Also Read: Anushka Sharma-Tollywood: అనుష్క శర్మ టాలీవుడ్ ఎంట్రీ.. కట్ చేస్తే.. !

మోహన్ లాల్ మూవీతో దర్శకుడిగా ఇంట్రడ్యూసైన ప్రియదర్శన్.. మళ్లీ ఆయనతోనే వందో సినిమా చేయనున్నాడు. మరక్కార్‌తో భారీ డిజాస్టర్ ఇచ్చిన ప్రియదర్శన్‌ను నమ్మి మరో ఛాన్స్ ఇచ్చారు లాలట్టన్. తన కూతురు విస్మయను హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేస్తోన్న తుడక్కుమ్‌లోనూ కీ రోల్ చేస్తున్నారు కంప్లీట్ స్టార్. హృదయ పూర్వం దర్శకుడు సత్యన్ అంతికాడుకు తనను డీల్ చేసే గోల్డెన్ ఆఫర్చునిటీ అందించారు మోహన్ లాల్. మహీషంటే ప్రతీకారమ్, జోజు చిత్రాలతో పాపులరైన దిలీష్ పోతన్, విష్ణు మోహన్ అనే యంగ్ దర్శకులకు తన లైనప్‌లో ప్లేస్ ఇచ్చారు. అలాగే లాలట్టన్‌తో సినిమాలు చేయకపోతే నిద్ర పట్టని జీతూ జోసెఫ్ మరోసారి టయ్యప్ అయ్యే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ నిర్మిస్తున్నట్లు సమాచారం.