July 12, 2026

SRH 300 Runs: కాటేరమ్మ కొడుకులు ఈసారి 300 కొట్టుడు ఖాయం

SRH 300 Runs: కాటేరమ్మ కొడుకులు ఈసారి 300 కొట్టుడు ఖాయం
Reading Time: 2 minutes

SRH 300 Runs: కాటేరమ్మ కొడుకులు ఈసారి 300 కొట్టుడు ఖాయం

Caption of Image.

SRH 300 Runs: త్వరలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. 2024 ఐపీఎల్ ఎడిషన్ లో 287పరుగులతో అత్యధిక స్కోరు చేసి, దాదాపు 300 పరుగుల మార్కుకు అత్యంత సమీపంలోకి చేరిన జట్టుగా రికార్డు సృష్టించింది. 2025 సీజన్‌లో కూడా 286 రన్స్ చేసి, 300+ స్కోరును నమోదు చేయగల సామర్థ్యం ఉందని మరోసారి నిరూపించుకుంది. అయితే, ఈసారి ఎలాగైనా 300 పరుగులు మార్క్ ని అందుకోవాలనే కసితో మరింత దూకుడైనా బ్యాటింగ్ తో కాటేరమ్మ కొడుకులు సిద్ధమవుతున్నారు. 

ఇషాన్ కిషన్ ఏమన్నారంటే?:
 సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోని కీలక ఆటగాళ్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. మేము 300 పరుగులు స్కోర్ చేయాలనే లక్ష్యంతో ఉన్నాం.. ఆ రోజున ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్లే అత్యంత కీలకమైన ఆటగాళ్లు కానున్నారు. నేను, అభిషేక్ శర్మ చెరో 70 పరుగులు చేస్తే చాలు.. మిగిలిన భారీ స్కోరును హెడ్, క్లాసెన్లే పూర్తి చేస్తారని భావిస్తున్నాను అన్నారు. ఈ వ్యాఖ్యలతో అక్కడ ఉన్న ప్లేయర్స్, అభిమానులు నవ్వులు చిందించారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్‌లతో కూడిన ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ ఎంత పటిష్టంగా ఉందో ఇషన్ మాటలు వింటుంటేనే తెలుస్తుంది.  

►ALSO READ | IPL Matches: 250కి పైగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన టాప్–5 ఇండియన్ ప్లేయర్స్ వీళ్లే

 స్ట్రాంగ్ బ్యాటింగ్.. బలహీనమైన బౌలింగ్?: 
ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు మెండిస్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నప్పటికీ, బౌలింగ్ విభాగంపై క్రీడా విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది కానీ, బౌలింగ్ అంత బాగాలేదన్నారు. పాట్ కమిన్స్ లేకపోవడం జట్టుకు పెద్ద మైనస్ అన్నారు. వారు టాప్-–4లోకి వెళ్లడం కష్టమేనని జోస్యం చెప్పారు.

ఇషాన్ కిషన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల అతడి సారథ్యంలోనే జార్ఖండ్ జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకుంది. అంతేకాకుండా, అహ్మదాబాద్‌లో జరిగిన 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీని గెలిచిన భారత జట్టులోనూ ఇషాన్ కీలక పాత్ర పోషించారు. అదే ఊపుతో ఇప్పుడు ఎస్‌ఆర్‌హెచ్‌ను నడిపించేందుకు సిద్ధమవుతున్నాడు.  మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎస్‌ఆర్‌హెచ్ తలపడనుంది.  

©️ VIL Media Pvt Ltd.