Reading Time: 2 minutes

Last Season For MS Dhoni: CSK ఫ్యాన్స్కి షాకింగ్ న్యూస్.. ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్!

Caption of Image.

Last Season For MS Dhoni: మహేంద్రసింగ్ ధోనీ లేకుంటే చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ను ఊహించడం చాలా కష్టమని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి ధోనీ CSK తరపున ఆడుతున్నాడు. అతని కెప్టెన్సీలోనే చెన్నై ఐదుసార్లు చాంపియన్ గా అవతరించింది. 2016, 2017 సీజన్లు మినహా, CSK మిగతా సీజన్లలో కనీసం ప్లేఆఫ్ చేరిన జట్టుగా నిలిచింది. 2025 సీజన్ ప్రారంభంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ తీసుకున్నప్పటికీ, గాయం కారణంగా మధ్యలో ధోనీ జట్టును మళ్లీ నడిపించాడు. తాజాగా మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే IPL 19వ సీజన్ ముందు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ధోనీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

ఎంఎస్ ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ ని ఊహించడం కష్టమే.. బహుశా ఇది ధోనీకి చివరి IPL సీజన్ కావొచ్చు అని పఠాన్ తెలిపారు. సంజూ శాంసన్ జట్టులో చేరడం, రుతురాజ్ గైక్వాడ్ ఉండటంతో ధోనీ వారికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. సంజూ భవిష్యత్తులో సీఎస్కే కెప్టెన్‌గా ఎదగడానికి ధోనీ సలహాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రుతురాజ్ ఇప్పటికే కెప్టెన్సీ అనుభవం కలిగినందున ఇది జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుందని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించారు. 

కానీ ఎంఎస్ ధోనీ ఫిట్నెస్ అండ్ బ్యాటింగ్ విషయంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయని భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పేర్కొన్నారు. ఫిట్నెస్ పరంగా అన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు.. జట్టులో ఉన్నప్పటికి ధోనీ డ్రెస్సింగ్ రూమ్‌లో అనేది గొప్ప బలం.. CSK మేనేజ్మెంట్ ఈ సీజన్‌లో కప్ గెలిచి ధోనీకి ఘన వీడ్కోలు ఇవ్వాలని చూస్తుంది.. కాగా ప్రతి ఐపీఎల్ సీజన్ కి ముందు “ఇదే ధోనికి చివరి సీజన్” అనే ప్రచారం జరిగింది.. కానీ ఈ సీజన్‌లో ఆయన CSK తరఫున కెప్టెన్సీ వహిస్తాడా, లేదా ప్లేయర్ గానే కొనసాగుతాడా అనే దానిపై CSK CEO కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. ఈ సీజన్‌లో ఎంఎస్ ధోనీ అన్ని మ్యాచ్లు ఆడతారు, కానీ ఏ రోల్ లో ఆడేది మాత్రం టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయిస్తుందన్నారు. 

©️ VIL Media Pvt Ltd.